Bed Relation: వారితో శృంగారం వద్దు.. మహిళలకు ‘పెటా’ పిలుపు..! మరి స్త్రీల సంగతేంటంటున్న నెటిజన్లు..
పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(PETA) జర్మనీ విభాగం.. మహిళాలోకానికి ఓ పిలుపునిచ్చింది. సెక్స్ స్ట్రైక్‌కు వెళ్లాలని.. నాన్ వెజ్ తినే మగవారితో శృంగారంలో పాల్గొనకూడదని చెప్పింది.
పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(PETA) జర్మనీ విభాగం.. మహిళాలోకానికి ఓ పిలుపునిచ్చింది. సెక్స్ స్ట్రైక్‌కు వెళ్లాలని.. నాన్ వెజ్ తినే మగవారితో శృంగారంలో పాల్గొనకూడదని చెప్పింది. సెప్టెంబర్ 22వ తేదీన తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది. ఇక ఇది కాస్తా బెడిసికొట్టింది. నెట్టింట తెగ పంచ్‌లు పేలుతున్నాయి. కొందరు మగవారికి ముక్క లేకుండా ముద్ద దిగదు. అలాంటి వారి వల్ల మూగజీవాలకు మాత్రమే కాదు.. భూమికి కూడా హాని కలుగుతుంది. ‘మహిళల కంటే మాంసం ఎక్కువగా తినే మగవారు పర్యావరణ కాలుష్యానికి 41 శాతం కారణం అవుతున్నారు. దీని వల్ల మహిళలు సెక్స్ స్ట్రైక్ చేయాలని.. తద్వారా వారిని శాఖాహారులుగా మార్చాలని మూగజీవాల హక్కుల పరిరక్షక సంస్థ పిలుపునిచ్చింది. కాగా, సోషల్ మీడియా వేదికగా పెటా ఇచ్చిన ఈ పిలుపుపై ఓ రేంజ్‌లో పంచ్‌లు, సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. పెటా ప్రచారంలో ఏమాత్రం నిజం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మాంసం తింటున్న మగవారితో సెక్స్ వద్దంటే.. మరి మాంసం తినే ఆడవారి సంగతేంటి’ అంటూ ఇంకొందరు సైటర్లు వేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!