మంచిర్యాల జిల్లాలో ఓ స్కూల్ టీచర్‌కు ఓ బాలిక పేరెంట్స్ దేహశుద్ది చేశారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న సత్యనారాయణ అనే తెలుగు పండితుడిని నడి రోడ్డుమీదే చెప్పుతో కొట్టారు. పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని రోడ్డు మీద చెప్పుతో చితకబాదారు బాలిక తల్లిదండ్రులు.