ఈ దృశ్యాలు చూశారు కదా. తెలుగు గడ్డపై వచ్చిన భూకంపం ప్రభావమిది. రెండు రాష్ట్రాలను వణికించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో.. జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం ఆఫీసులకు, వ్యాపారాలకు, స్కూళ్లకు వెళ్లే సమయం కావడంతో అంతా రెడీ అయ్యే పనిలో ఉన్నారు. బుధవారం ఉదయం 7 గంటల 27 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించింది. కొందరికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మరికొందరైతే.. తమ తల తిరుగుతోందోమో అని ఆందోళన చెందారు. తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఈ భూకంపం ఏర్పడింది.