World Most Polluted: కాలుష్యంలో ప్రపంచ నెం.1 ఢిల్లీ.! కాలుష్యంలో ప్రపంచ మూడో స్థానంలో భారత్‌

దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్విస్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్ 2023లో వెల్లడించింది. ఈ సర్వేలో 2018 నుంచి వరుసగా నాలుగుసార్లు ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా టాప్‌లో ఉంటూ వస్తోంది. 2022లో ఢిల్లీ పీఎం 2.5 లెవెల్స్‌ క్యూబిక్‌ మీటర్‌కు 89.1 మైక్రో గ్రాములు ఉండగా 2023లో ఇది 92.7 గ్రాములకు చేరింది.

World Most Polluted: కాలుష్యంలో ప్రపంచ నెం.1 ఢిల్లీ.! కాలుష్యంలో ప్రపంచ మూడో స్థానంలో భారత్‌

|

Updated on: Mar 20, 2024 | 5:29 PM

దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్విస్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్ 2023లో వెల్లడించింది. ఈ సర్వేలో 2018 నుంచి వరుసగా నాలుగుసార్లు ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా టాప్‌లో ఉంటూ వస్తోంది. 2022లో ఢిల్లీ పీఎం 2.5 లెవెల్స్‌ క్యూబిక్‌ మీటర్‌కు 89.1 మైక్రో గ్రాములు ఉండగా 2023లో ఇది 92.7 గ్రాములకు చేరింది. ఇక బీహార్‌లోని బెగుసరాయ్‌ పట్టణం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణమని ఐక్యూ ఎయిర్‌ తెలిపింది. క్యూబిక్‌ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాముల పీఎం 2.5 కాన్సంట్రేషన్‌తో ప్రపంచంలోనే మూడవ అత్యంత కాలుష్య దేశంగా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ల తర్వాత భారత్‌ ఉందని వెల్లడించింది. 2022లో ఐక్యూ ఎయిర్‌ కాలుష్య దేశాల ర్యాంకుల్లో భారత్‌ 8వ ర్యాంకులో ఉండగా 2023లో అది 3వ ర్యాంకుకు ఎగబాకింది. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతీ క్యూబిక్ మీటర్ ఏరియాలోని గాలిలో పీఎం 2.5 స్థాయులు గరిష్ఠంగా 5 మైక్రోగ్రాములు మించకూడదు. అంతకు మించి ఉంటే అస్తమా, క్యాన్సర్, గుండె పోటు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల బారిన పడతారని హెచ్చరించింది. అయితే, మన దేశంలోని చాలా నగరాలలో ఈ స్థాయులు అత్యధికంగా ఉన్నాయి. డబ్ల్యూహెచ్ వో గైడ్ లైన్స్ కన్నా దాదాపు ఏడెనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ చోటుచేసుకుంటున్న ప్రతీ తొమ్మిది మరణాలలో ఒకటి వాయు కాలుష్యం కారణంగానేనని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యంతో సుమారు 70 లక్షల మంది ప్రిమెచ్యూర్ డెత్ కు గురవుతున్నారని డబ్ల్యూహెచ్ వో ఓ నివేదికలో వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us