పెళ్లి వేదికపై వధువు డాన్స్.. ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకులు
పెళ్లి మండపంలో అందంగా అలంకరించుకుని ఉన్న వధువు డాన్స్ చేస్తోంది. బంధుమిత్రులంతా వధువును ఉత్సాహపరుస్తున్నారు. వధువు మైమరచి అందంగా డాన్స్ చేస్తోంది. ఇంతలో కొందరు యువకులు ఒక్కసారిగా స్టేజ్‌మీదకు దూసుకొచ్చారు. వాళ్లు అలా సడన్‌గా వేదికపైకి..
పెళ్లి మండపంలో అందంగా అలంకరించుకుని ఉన్న వధువు డాన్స్ చేస్తోంది. బంధుమిత్రులంతా వధువును ఉత్సాహపరుస్తున్నారు. వధువు మైమరచి అందంగా డాన్స్ చేస్తోంది. ఇంతలో కొందరు యువకులు ఒక్కసారిగా స్టేజ్‌మీదకు దూసుకొచ్చారు. వాళ్లు అలా సడన్‌గా వేదికపైకి రావడంతో షాకయింది వధువు. వారంతా వధువు వెనుక వేదికపైన మంటలు అంటుకోవడం గమనించి పరుగెత్తుకొచ్చారు. యువకులు వధువును కంగారు పెట్టకుండా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పేందుకు ఓ యువకుడు విశ్వప్రయత్నమే చేసి కిందపడ్డాడు. మరికొందరేమో మంటలపైకి తమ చేతికందినది విసిరి ఆర్పడానికి ట్రై చేశారు. కొందరు చెప్పులు కూడా విసిరారు. చివరకు ఓ యువకుడు తన వద్ద ఉన్న పూలబొకేతో మంటలను ఆర్పాడు. ఈ వీడియో నెట్టింట చేరి వైరల్ కావడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వధూవరులకు ఇబ్బంది కలిగించకూడదని యువకులు పడిన తపనకు తెగ మెచ్చుకుంటున్నారు. యువకులు మంటలను గమనించి సకాలంలో స్పందిచకపోతే పెను ప్రమాదమే జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెడ్ పై కూర్చుని స్టైల్ గా సిగరేట్ వెలిగించాడు.. ముక్క బెడ్‌పై పడటంతో !!
మనవడి పెళ్లిలో తాత డాన్స్.. 96 ఏళ్ల వయసులో క్రేజీ స్టెప్స్
Prabhas: ప్రభాస్ దావత్ అంటే.. మామూలుగా ఉండదు మరి..
Surya: కథనరంగంలో కార్చిచ్చులా.. కంగువ..
Vikram: గూస్ బంప్స్ తెప్పిస్తున్న చావు బతుకుల పోరాటం..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

