Corona Marriage: కరోనా మహమ్మారి మనుషుల అలవాట్లను పూర్తిగా మార్చేసింది. పక్కన ఉన్నవారు ఎవరైనా దగ్గితే చాలు భయంకరంగా చూసే పరిస్థితులు వచ్చాయి. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ఎంతో నష్టాన్ని కలిగిస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా అన్ని రకాల కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి.
వీటిలో వివాహాది శుభ కార్యక్రమాలు మొదటి వరసలో ఉంటున్నాయి. కొందరు ఇప్పటికే వివాహాలను వాయిదా వేసుకోగా మరికొందరు మాత్రం తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. అత్యంత తక్కువ మంది సమక్షంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక కరోనా భయంతో ఇటీవల ఓ జంట పీపీఈ కిట్లను ధరించి వివాహం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మరో వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. తాజాగా ఓ జంట వివాహం చేసుకుంది. అయితే వివాహ సమయంలో దండలను మార్చుకునే సమయంలో వెదరు కర్రలతో దూరంగా ఉంటూ దండలను మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్ ఆఫీసర్.. ‘కరోనా సమయంలో పెళ్లిళ్లను నిర్వహించడానికి ఈవెంట్ ప్లానర్స్ ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి’ అనే ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చారు. కరోనా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తుందో అని కొందరు కామంట్లు పెడుతున్నారు.
#कोरोना में शादियां सफलतापूर्वक संपन्न कराने के लिए इवेंट मैनेजर्स को क्या क्या जुगाड़ू समाधान निकालना पड़ता है…. ?? pic.twitter.com/2WOc9ld0rU
— Dipanshu Kabra (@ipskabra) May 2, 2021
Also Read: ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..
రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..