ఆ ప్రాంతంలో కఠినంగా లాక్ డౌన్.. ఈ చిన్నారి చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు.. అసలు ఏం చేసిందంటే..

Viral Video: దేశ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టాయి.

ఆ ప్రాంతంలో కఠినంగా లాక్ డౌన్.. ఈ చిన్నారి చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు.. అసలు ఏం చేసిందంటే..
Viral Video

Viral Video: దేశ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించగా.. మరికొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలవుతుండగా.. ఆంధ్రప్రదేశ్‏లో నేటి నుంచి పగలు ఒంటి గంట నుంచి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్, కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయడానికి మరోసారి పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపై గస్తీలు కాస్తూ.. ప్రజలెవరు బయటకు రాకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో కర్ఫ్యూలో భాగంగా డ్యూటీలో ఉన్న పోలీసుల దగ్గరకు వెళ్ళి ఓ చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో.. ఒక ప్రాంతంలో కఠినంగా అమలవుతుంది. అందులో భాగంగా కొంతమంది పోలీసులు ప్రజలెవరు బయటకు రాకుండా చూస్తున్నారు. అయితే ఎక్కడినుంచి వచ్చిందో ఓ చిన్నారి ఆకస్మాత్తుగా చేతిలో ఓ కర్ర పట్టుకోని వచ్చి అక్కడున్న పోలీసులకు ఇచ్చింది. ఇక ఆ చిన్నారి కర్ర పట్టుకొని రావడంతో.. ఆ పోలీసు కూడా ఏం అనకుండా నెమ్మదిగా కర్రను తీసుకున్నాడు. ఆ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా సోషల్ మీడియాలో అమాయక బాల్యానికి కూడా ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసు అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. ఆ చిన్నారి చేసిన పనికి ప్రశంసిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Pooja Hegde: కోవిడ్‏ను జయించిన పూజా హెగ్డే… స్టుపిడ్‌ కరోనాను తన్నేశా అంటూ ట్వీట్..

అషు రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ రిలేషన్.. అసలు విషయాన్ని చెప్పిన సింగర్.. ఏడుపొచ్చేస్తోంది అంటూ అషు ట్వీట్..