Pooja Hegde: కోవిడ్‏ను జయించిన పూజా హెగ్డే… స్టుపిడ్‌ కరోనాను తన్నేశా అంటూ ట్వీట్..

Pooja Hegde: పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. కరోనా వైరస్‌ను కాలుతో తన్నేసిందట. తనను ఇన్నాళ్లను పట్టుకు కూర్చున్నందుకు కాస్త గట్టిగానే.. తరిమేసిందట.

Pooja Hegde: కోవిడ్‏ను జయించిన పూజా హెగ్డే... స్టుపిడ్‌ కరోనాను తన్నేశా అంటూ ట్వీట్..
Pooja Hegde
Follow us
Rajitha Chanti

|

Updated on: May 05, 2021 | 6:44 PM

Pooja Hegde: పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. కరోనా వైరస్‌ను కాలుతో తన్నేసిందట. తనను ఇన్నాళ్లను పట్టుకు కూర్చున్నందుకు కాస్త గట్టిగానే.. తరిమేసిందట. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కరోను జయించింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. తెగ సంబరపడిపోయింది. “నాపై ప్రేమను కురిపించిన మీ అందరికీ థాంక్స్‌. నేను బాగా కోలుకున్నాను. స్టుపిడ్‌ కరోనాను ఓ తన్ను తన్నాను. కరోనా నెగటివ్‌ వచ్చింది. మీ అందరికీ ప్రార్థనలు కారణంగానే నాకు రోగనిరోధక శక్తి వచ్చి మేజిక్‌ జరిగింది. మీకెప్పటికీ రుణపడి ఉంటాను” అని పూజా హెగ్డే ట్వీట్ చేసింది. అంతేకాదు అందరూ కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది కూడా…

ఇక పూజా హెగ్డే ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె సెల్ఫ్‌ ఐసోలేషన్‌‏లో ఉంటూ డాక్టర్ల సూచనలతో తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఇక తాజాగా ఈ అమ్మడు కరోనాను జయించింది. క్యారంటైన్‏లో ఉన్నా కానీ.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంది పూజా. తన క్యారంటైన్ కాలాన్ని పుస్తకాలు చదివేందుకు వినియోగిస్తున్నట్లుగా పూజా గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూజా హెగ్డే.. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్.. అఖిల్ అక్కినేనికి జోడీగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇవే కాకుండా.. తమిళ స్టార్ విజయ్ దళపతి సినిమాలోనూ ఈ బుట్టబోమ్మ నటిస్తోంది.

ట్వీట్..

Also Read:  పరభాష చిత్రాలను నమ్ముకుంటున్న సీనియర్ హీరో.. మరో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే పనిలో వెంకీ..

గరిటపట్టిన బన్నీ డాటర్.. నాన్న కోసం స్పెషల్‏గా దోశ వేసిన అర్హ.. ఎప్పటికీ మర్చిపోలేనంటున్న అల్లు అర్జున్..