AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: కదులుతున్న రైలు నుంచి దిగిన మహిళ.. రెప్పపాటులో ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్.. వైరల్ వీడియో

Tirupathi railway police: కదిలే రైలును ఎక్కవద్దని.. అలాగే దిగొద్దంటూ తరచూ రైల్వే శాఖ నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటుంది. కానీ చాలా మంది ప్రయాణికులు అలాంటి సూచనలు, సలహాలను

Tirupati: కదులుతున్న రైలు నుంచి దిగిన మహిళ.. రెప్పపాటులో ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్.. వైరల్ వీడియో
Tirupati Ap
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 05, 2021 | 9:16 PM

Tirupati railway police: కదిలే రైలును ఎక్కవద్దని.. అలాగే దిగొద్దంటూ తరచూ రైల్వే శాఖ నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటుంది. కానీ చాలా మంది ప్రయాణికులు అలాంటి సూచనలు, సలహాలను పట్టించుకోకుండా ప్రమాదంలో పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. తాజగా ఓ రైల్వే పోలీసు తన ధైర్య సాహసాలతో ఓ మహిళను ప్రాణాలను కాపాడాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం 4.30 గంటలకు తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కదులుతోంది. ఇంతలో ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి దిగింది. ఈ క్రమంలో ఆమె రైలు కింద పడబోయింది. ఇది గమనించిన డ్యూటీలో ఉన్న రైల్వే పోలీస్ సతీశ్ ఆమెను‌ పైకి లాగాడు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మహిళను కాపాడిన రైల్వే పోలీస్ సతీశ్‌ను అక్కడున్న వారంతా అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో బంధువులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సదరు మహిళ విశాఖ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చినట్లు పేర్కొంటున్నారు. అయితే అప్పుడే నిద్ర నుంచి మేల్కోని.. కదులుతున్న రైలు నుంచి దూకేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్లాట్ ఫాంపై విధిలు నిర్వహిస్తూ.. చాకచక్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను అధికారులు, ప్రయాణికులు అభినందించారు.

Also Read:

Corona Home Isolation Kit: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. బాధితుల ఇంటికే ఉచిత కరోనా కిట్… కిట్‌లో ఏమేం ఉంటాయంటే..!

అసలే కరోనా టైమ్.. ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినడం చాలా అవసరం.! ఒక్కసారి ట్రై చేయండి.!!

అటు ఎండలు.. ఇటు వానలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ చూశారా..?
అటు ఎండలు.. ఇటు వానలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ చూశారా..?
ఆమె మాటలు నన్ను బాధపెట్టాయి.. ఇక పై మా ఫ్రెండ్‌షిప్ అలా ఉండదు..
ఆమె మాటలు నన్ను బాధపెట్టాయి.. ఇక పై మా ఫ్రెండ్‌షిప్ అలా ఉండదు..
సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్
సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్
'ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే'.. సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్
'ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే'.. సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్
హల్దీ వేడులకల్లోకి డైనోసోర్.. గెటప్‌ తీసి చూడగా అశ్చర్యపోయిన..
హల్దీ వేడులకల్లోకి డైనోసోర్.. గెటప్‌ తీసి చూడగా అశ్చర్యపోయిన..
ఈ టైమ్‌లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..
ఈ టైమ్‌లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..
వణికిపోతున్న పాకిస్తాన్.. పీఓకేలోని ఉగ్ర శిబిరాలు ఖాళీ..!
వణికిపోతున్న పాకిస్తాన్.. పీఓకేలోని ఉగ్ర శిబిరాలు ఖాళీ..!
ఏడూ, ఎనిమిదిమందిని ప్రేమించా.. 23 ఏళ్లకే అన్ని చూసేశా..
ఏడూ, ఎనిమిదిమందిని ప్రేమించా.. 23 ఏళ్లకే అన్ని చూసేశా..
చిరంజీవికి చెల్లిగా.. భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
చిరంజీవికి చెల్లిగా.. భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
14 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. పాయింట్ల పట్టికలో గుజరాత్‌కు బిగ్ షాక్?
14 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. పాయింట్ల పట్టికలో గుజరాత్‌కు బిగ్ షాక్?