సూర్యుడికంటే 10 రెట్లు పెద్దదైన బ్లాక్ హోల్.. భూమికి అతి దగ్గరగా..
ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఓ భారీ కృష్ణబిలాన్ని కనుగొన్నారు. సూర్యుడికంటే 10 రెట్లు పెద్దగా ఉన్న ఈ బ్లాక్ హోల్ భూమికి అతి దగ్గరగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఓ భారీ కృష్ణబిలాన్ని కనుగొన్నారు. సూర్యుడికంటే 10 రెట్లు పెద్దగా ఉన్న ఈ బ్లాక్ హోల్ భూమికి అతి దగ్గరగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కృష్ణబిలం నక్షత్ర మండలానికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు తెలిపారు. ఇంతకు ముందు కనుగొన్న కృష్ణబిలం కంటే ఇది భూమికి మూడు రెట్లు చేరువలో ఉంది. ఇది నక్షత్ర ద్రవ్యరాశి విభాగానికి చెందినదని పరిశోధకులు భావిస్తున్నారు. అంతేకాదు అసాధారణమైన అంతరిక్ష భాగాల పరిణామక్రమం గుట్టు విప్పేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, పాలపుంతలో నిద్రాణ స్థితిలో ఉన్న కృష్ణబిలాన్ని స్పష్టంగా గుర్తించడం ఇదే మొదటిసారి. నక్షత్ర ద్రవ్యరాశి సహిత కృష్ణబిలాలు సూర్యుడి ద్రవ్యరాశితో పోల్చితే 5 నుంచి 100 రెట్లు అధిక బరువున్న ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇలాంటివి ఒక్క పాలపుంతలోనే 100 మిలియన్ల వరకు ఉంటాయట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తమ్ముడి మాటలకు.. అన్నకు కన్నీళ్లు ఆగేలదు !!
Rashmika Mandanna: సోషల్ మీడియా ట్రోల్స్‌పై .. రష్మిక ఎమోషనల్ పోస్ట్
HIT 2: ‘ఉరికే ఉరికే’ సాంగ్.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడివి శేష్
చిరకాల వాంఛ నెరవేర్చుకున్న నిఖత్ జరీన్.. సల్మాన్‌తో కలిసి స్టెప్పులు
Anushka Shetty: వంటలక్క పాత్రలో అనుష్క శెట్టి !! పుట్టినరోజు సందర్భంగా..