బయటపడిన అత్యంత అరుదైన మరకతం !! ఏకంగా కిలోన్నర !!

బయటపడిన అత్యంత అరుదైన మరకతం !! ఏకంగా కిలోన్నర !!

Phani CH

|

Updated on: Nov 10, 2022 | 8:29 AM

మరకతం.. ఇది అత్యంత విలువైన రత్నం. ఇది బెరైల్‌ ఖనిజం యొక్క కొత్త రూపం. ఇది ఆకుపచ్చని రంగుతో క్రోమియంను కలిగి ఉంటుంది. దీనిని వాడుక భాషలో 'పచ్చ'గా వ్యవహరిస్తారు.

మరకతం.. ఇది అత్యంత విలువైన రత్నం. ఇది బెరైల్‌ ఖనిజం యొక్క కొత్త రూపం. ఇది ఆకుపచ్చని రంగుతో క్రోమియంను కలిగి ఉంటుంది. దీనిని వాడుక భాషలో ‘పచ్చ’గా వ్యవహరిస్తారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఈ ముడి మరకతం తాజాగా ఆఫ్రికాలోని జాంబియా దేశంలో బయటపడింది. జాంబియాలోని కాగెం గనిలో మానస్‌ బెనర్జీ, రిచర్డ్‌ కెప్టా నేతృత్వంలోని బృందం చేపట్టిన తవ్వకాల్లో ఇది లభ్యమైంది. దీని బరువు ఏకంగా 7,525 క్యారట్లు అంటే 1.505 కేజీలు అన్నమాట. ఇంత భారీ మరకతం బయటపడటం ఇదే తొలిసారి. దాంతో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మరకతంగా గిన్నిస్‌ రికార్డును బద్దలుకొట్టింది. ఈ మరకతం పైభాగాన ఉబ్బెత్తుగా ఉండటంతో దీనికి ‘చిపెంబెలె’ అని పేరు పెట్టారు. చిపెంబెలె అబటే జాంబియాలోని బెంబా ప్రజల భాషలో ఖడ్గమృగం అని అర్థం. కాగా గతంలోనూ ఇదే గనిలో కొన్ని భారీ మరకతాలు తవ్వకాల్లో బయటపడ్డాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూర్యుడికంటే 10 రెట్లు పెద్దదైన బ్లాక్‌ హోల్‌.. భూమికి అతి దగ్గరగా..

తమ్ముడి మాటలకు.. అన్నకు కన్నీళ్లు ఆగేలదు !!

Rashmika Mandanna: సోషల్‌ మీడియా ట్రోల్స్‌పై .. రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌

HIT 2: ‘ఉరికే ఉరికే’ సాంగ్‌.. లిప్‌ లాక్‌తో రెచ్చిపోయిన అడివి శేష్‌

చిరకాల వాంఛ నెరవేర్చుకున్న నిఖత్‌ జరీన్‌.. స‌ల్మాన్‌తో కలిసి స్టెప్పులు

 

Published on: Nov 10, 2022 08:29 AM