Biker Granny: స్పోర్ట్స్ బైక్ పై రయ్యి రయ్యిన దూసుకుపోతున్న బామ్మ.. నెట్టింట్లో వీడియో వైరల్

Surya Kala

Surya Kala |

Updated on: Jul 29, 2021 | 4:07 PM

Biker Granny: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం వింతగా అనిపించినా వెంటనే షేర్ చేస్తున్నారు. జంతువులు వీడియోలే కాదు....

Biker Granny: స్పోర్ట్స్ బైక్ పై రయ్యి రయ్యిన దూసుకుపోతున్న బామ్మ.. నెట్టింట్లో వీడియో వైరల్
Old Bhama Bike Riding

Follow us on

Biker Granny: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం వింతగా అనిపించినా వెంటనే షేర్ చేస్తున్నారు. జంతువులు వీడియోలే కాదు.. తమలోని ప్రతిభను చూపిస్తున్న వ్యక్తుల వీడియోలు కూడా షేర్ అవుతూ.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకూ డ్యాన్స్ చేస్తున్న యువతని కాదు.. బామ్మలను చూశాం. యువతతో సామానంగా ప్రతిభ చూపుతున్న బామ్మలకు జోహార్లు అంటూ ఎన్నో వీడియాలు గతంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే ఈసారి ఓ బామ్మ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

నేటి యువతకు బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం.. ఆడామగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా బండి నడుపుతున్నారు.. ఇక జెంట్స్ కు స్పోర్ట్స్ బైక్ అంటే మరీ ఇష్టం.. స్పోర్ట్స్ బైక్ మీద రయ్యి రయ్యి మంటూ.. దూసుకుపోతుంటే ఆ ఫీలింగ్ గురించి చెప్పడం కంటే అనుభవిస్తేనే తెలుస్తుంది దీని మజా అంటారు అయితే ఒక వృద్ధురాలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ బామ్మ కెమెరా ని చూస్తూ నవ్వుతూ యమహా R15 ను నడుపుతుంది.. బైక్ రైడింగ్ ని ఎంజయ్ చేస్తుంది. అయితే ఈ వీడియో ఎక్కడ ఎప్పుడు చిత్రీకరించబడింది.. ఆ స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న బామ్మ వివరాలు తెలియలేదు.. కానీ సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతూ సందడి చేస్తోంది . మీరు కూడా బామ్మగారి బైక్ రైడింగ్ పై ఓ లుక్ వేయండి మరి

View this post on Instagram

A post shared by @__shubham__5x

Also Read: star sapphire : బావి కోసం తవ్వుతుంటే..రూ. 175 కోట్ల విలువజేసే పెద్ద నీలమణుల క్లస్టర్ దొరికింది ఎక్కడో తెలుసా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu