వామ్మో.. పార్కింగ్‌ ఫీజు వెయ్యి రూపాయలా ??

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులో ట్రాఫిక్ స‌మ‌స్య గురించి ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. ఈ సమస్యను కొందరు అవకాశంగా మలచుకుని క్యాష్‌ చేసుకుంటున్నారు. ఆ న‌గ‌రంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్ స‌మ‌స్యను కొన్ని మాల్స్ క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాయి. పార్కింగ్‌ పేరుతో ఏకంగా వేలల్లో వసూలు చేస్తున్నాయి. ఏకంగా గంటకు రూ.1000 వ‌ర‌కు ఫీజు వ‌సూలు చేస్తుండ‌డం ఇప్పుడు నెట్టింట చ‌ర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన సైన్ బోర్డులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

వామ్మో.. పార్కింగ్‌ ఫీజు వెయ్యి రూపాయలా ??

|

Updated on: Mar 10, 2024 | 5:37 PM

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులో ట్రాఫిక్ స‌మ‌స్య గురించి ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. ఈ సమస్యను కొందరు అవకాశంగా మలచుకుని క్యాష్‌ చేసుకుంటున్నారు. ఆ న‌గ‌రంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్ స‌మ‌స్యను కొన్ని మాల్స్ క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాయి. పార్కింగ్‌ పేరుతో ఏకంగా వేలల్లో వసూలు చేస్తున్నాయి. ఏకంగా గంటకు రూ.1000 వ‌ర‌కు ఫీజు వ‌సూలు చేస్తుండ‌డం ఇప్పుడు నెట్టింట చ‌ర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన సైన్ బోర్డులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. UB సిటీలో వాహ‌నాల పార్కింగ్ ఫీజు తాలూకు ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అందులో పార్కింగ్ ఫీజు గంట‌కు వెయ్యి రూపాయ‌లు అని ఉంది. ఓ ఎక్స్‌ యూజ‌ర్ ఈ ఫొటోను షేర్ చేశారు. దాంతో ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. యూబీ సిటీ పార్కింగ్‌లో ఏదైనా ప్రత్యేక‌త ఉందా? పార్కింగ్‌కి గంట‌కు ఏకంగా 1000 రూపాయలా? అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా, రాజ‌ధాని న‌గ‌రంలో 2015 వ‌ర‌కు పార్కింగ్ ఫీజు గంట‌కు కేవ‌లం రూ.40 ఉండేదట‌. కానీ, వాహ‌నాల సంఖ్య ప్రతియేటా భారీగా పెరుగుతుండ‌డంతో పార్కింగ్ స‌మ‌స్య వేధిస్తోంది. దీంతో ప్రస్తుతం పార్కింగ్‌ బిజినెస్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంద‌ని బెంగ‌ళూరు వాసులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు వేల ఏళ్ల క్రితం నాటి భూమి ఏలియన్స్‌కు ఇప్పుడు కనిపిస్తుందట

తన ప్రాణం కాపాడిన వ్యక్తికి.. కాపలాగా ఉంటున్న నాగు పాము ??

Kubera: ఆ బిచ్చగాడే… శేఖర్ కమ్ముల కుబేరానా ??

Chiranjeevi: రామ్ చరణ్ తో జాన్వీ రొమాన్స్.. చిరు కామెంట్స్ వైరల్ !!

Sai Sharam Tej: అమ్మపై కోసం పేరు మార్చుకున్న తేజ్‌..! అంతా మంచే జరుగుతుంది తేజ్‌!

Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో