Kadiyapulanka Nursery: అద్భుతం.! కడియం నర్సరీలో అయోధ్య రామాలయం..! వీడియో వైరల్.
రామయ్య కోసం నిర్మించిన అయోధ్య భవ్య రామమందిరం ప్రారంభోత్సవం గురించి తలచుకుంటేనే మనసు పులకరిస్తుంది. అయోధ్య రాముని దర్శనం కోసం దేశం యావత్తు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆ శుభతరుణం అతి త్వరలోనే రానుంది. కొత్త ఏడాదిలో దేశ ప్రజలకు రామయ్య దర్శన భాగ్యం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకు అన్ని ఏర్పాట్లూ చకచకా జరిగిపోతున్నాయి. ఉడతాభక్తిగా అన్న మాటకు రామాయణంలో ఎంత విలువ ఉందో అందరికీ తెలుసు..
రామయ్య కోసం నిర్మించిన అయోధ్య భవ్య రామమందిరం ప్రారంభోత్సవం గురించి తలచుకుంటేనే మనసు పులకరిస్తుంది. అయోధ్య రాముని దర్శనం కోసం దేశం యావత్తు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆ శుభతరుణం అతి త్వరలోనే రానుంది. కొత్త ఏడాదిలో దేశ ప్రజలకు రామయ్య దర్శన భాగ్యం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకు అన్ని ఏర్పాట్లూ చకచకా జరిగిపోతున్నాయి. ఉడతాభక్తిగా అన్న మాటకు రామాయణంలో ఎంత విలువ ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ నర్సరీ చేసిన కృషిని ఇలాగే సరిపోల్చాలి. దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్యరాముని పట్ల తమకున్న భక్తిని వివిధ రూపాలలో చాటుకుంటున్నారు. ఒకరు పాదుకలు అందిస్తే.. మరొకరు గంటలు.. ఇంకొకరు ఆభరణాలు.. నైవేద్యాలు ..అక్షింతలు ఇలా రకరకాలుగా కానుకలు పంపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియపు లంకలో మొక్కలతో అయోధ్య రామమందిర నమూనాను రూపొందించి చలో అయోధ్య అంటూ రామయ్య దర్శనానికి పిలుపునిచ్చారు. ఈ దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియపు లంక సత్యదేవ నర్సరీలో కొత్త ఏడాదికి మొక్కలతో స్వాగతం పలికేలా ఓ ప్లాన్ తయారుచేశారు. 2024 కు వెల్ కమ్ చెప్పడానికి.. అలాగే రామయ్యకు ఉడతాభక్తిగా.. ఈ మొక్కలతో అయోధ్య రామమందిర నమూనాను తయారుచేశారు. దీనికోసం 50 వేల మొక్కలను ఉపయోగించారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. వారం రోజుల పాటు అక్కడివారంతా శ్రమిస్తే.. అందమైన ఈ దృశ్యం అందరి కళ్లముందు నిలిచింది. రామ మందిరాన్ని మళ్లీ నిర్మించుకోవడం హిందువులందరికీ గర్వకారణం అన్నారు నర్సరీ యజమాని. అందుకే మొక్కలతో రామమందిర్ ఆకృతిని తయారుచేశామన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.