Mumbai: లోకల్ ట్రైన్‌లో సామాన్యుడిలా బిలియనీర్ నిరంజన్ హీరానందానీ ప్రయాణం.. వీడియో వైరల్.
ముంబయిలో ప్రతీ రోజూ లోకల్ రైళ్లలో లక్షలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఓ బిలియనీర్ సాదాసీదాగా లోకల్ రైలులో ప్రయాణించారు. ఎందుకో తెలిస్తే షాకవుతారు! రియల్ ఎస్టేట్ దిగ్గజమైన బిలియనీర్ నిరంజన్ హీరానందానీ ముంబయి లోకల్ రైలులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హీరానందానీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన 73 ఏళ్ల హీరానందానీ శుక్రవారం తన రైలు ప్రయాణం వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
ముంబయిలో ప్రతీ రోజూ లోకల్ రైళ్లలో లక్షలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఓ బిలియనీర్ సాదాసీదాగా లోకల్ రైలులో ప్రయాణించారు. ఎందుకో తెలిస్తే షాకవుతారు! రియల్ ఎస్టేట్ దిగ్గజమైన బిలియనీర్ నిరంజన్ హీరానందానీ ముంబయి లోకల్ రైలులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హీరానందానీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన 73 ఏళ్ల హీరానందానీ శుక్రవారం తన రైలు ప్రయాణం వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇతర ప్రయాణికులతో కలిసి ప్లాట్ ఫాం పై వేచి ఉన్న హీరానందానీ ఏసీ బోగీలో ఎక్కి థానే జిల్లా ఉల్లాస్ నగర్ రైల్వేస్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ రైలు ప్రయాణంలో ఆయనతోపాటు అతని బృందంలోని కొందరు సభ్యులు వెంట ఉన్నారు. తాను ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతోపాటు ట్రాఫిక్ అవరోధాలను అధిగమించడానికి లోకల్ రైలులో ప్రయాణించానని ఆయన పేర్కొన్నారు. హీరానందానీ షేర్ చేసిన వీడియోకు సోషల్ మీడియాలో 22 మిలియన్ల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. ప్రజారవాణా అయిన లోకల్ రైలులో ప్రయాణించినందుకు బిలియనీర్‌ను నెటిజన్లు ప్రశంసించారు. తమదైనశైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

