అప్పుడు కేసులు, ఇప్పుడు పూలు.! మోదీపై పూల వర్షం కురిపించిన బాబ్రీ మసీదు కేసు పిటిషనర్‌

అప్పుడు కేసులు, ఇప్పుడు పూలు.! మోదీపై పూల వర్షం కురిపించిన బాబ్రీ మసీదు కేసు పిటిషనర్‌

Anil kumar poka

|

Updated on: Jan 02, 2024 | 7:38 PM

రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. జనవరి 22వ తేదీన రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌ సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. ప్రధాని మోదీ శనివారం వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్యలో రోడ్‌ షోలో పాల్గొన్న ప్రధాని మోదీపై స్థానికులు పూల వర్షం కురిపించారు. ఈ టూర్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి..

రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. జనవరి 22వ తేదీన రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌ సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. ప్రధాని మోదీ శనివారం వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్యలో రోడ్‌ షోలో పాల్గొన్న ప్రధాని మోదీపై స్థానికులు పూల వర్షం కురిపించారు. ఈ టూర్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ సామాన్య మహిళ ఇంటికి వెళ్లి టీ తాగి అందరినీ ప్రధాని ఆశ్చర్యానికి గురిచేస్తే.. ఆనాడు బాబ్రీ మసీదు విషయంలో కేసులు వేసిన వ్యక్తి.. ఇప్పుడు మోదీపై పూలవర్షం కురిపించారు. బాబ్రీ మసీదు కేసులు విషయంలో ముస్లిం పక్ష పిటిషనర్లలో ఒకరైన ఇఖ్బాల్‌ అన్సారీ ఇప్పుడు ప్రధానిపై పూలతో పాటు ప్రశంసలు కురిపించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దేశ ప్రధాని.. అంటే అందరికీ ప్రధాని. అందుకే ఆయన వాహనం మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు గులాబీ పూలతో స్వాగతం పలికాను. నా కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు. మోదీ రాకతో అయోధ్య పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. ఇంతకుముందు ఇక్కడ చిన్న రైల్వే స్టేషన్‌ ఉండేది. ఇప్పుడు దాన్ని పునర్నిర్మించారు. గతంలో విమానాశ్రయం లేదు. ఇప్పుడు దాని నిర్మాణమూ పూర్తైందంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు. శ్రీరామ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో తప్పక భాగస్వామినవుతానని అన్సారీ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Jan 02, 2024 07:28 PM