Viral Video: ఇలా కూడా సిక్సర్ బాదొచ్చా.. వైర‌ల్ అవుతోన్న వీడియో.. అనుమానం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు..

Viral Video: సోష‌ల్‌ మీడియా విస్తృతి పెరిగినప్ప‌టి నుంచి ఏ సంఘ‌ట‌న కాస్త విచిత్రంగా క‌నిపించినా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వీడియోలు క్ష‌ణాల్లో ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై..

Viral Video: ఇలా కూడా సిక్సర్ బాదొచ్చా.. వైర‌ల్ అవుతోన్న వీడియో.. అనుమానం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 22, 2022 | 5:43 PM

Viral Video: సోష‌ల్‌ మీడియా విస్తృతి పెరిగినప్ప‌టి నుంచి ఏ సంఘ‌ట‌న కాస్త విచిత్రంగా క‌నిపించినా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వీడియోలు క్ష‌ణాల్లో ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజ‌న్లు కాస్త అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ ఆ వీడియో ఎంటి.? నెటిజ‌న్ల అనుమానం ఏంట‌నేగా మీ సందేహం.

వివ‌రాల్లోకి వెళితే.. ఓ వ్య‌క్తి గ్రౌండ్‌లో బ్యాంటింగ్ చేస్తున్నాడు. ఆ స‌మ‌యంలోనే ఓ బంతి దూసుకొచ్చింది. దీంతో బ్యాట్స్‌మెన్ వెంట‌నే ఎడ‌మ చేతితో కాళ్ల వెన‌క నుంచి భారీ షాట్ కొట్టాడు. దీంతో బంతి లెగ్ సైడ్ దిశగా బౌండ‌రీని దాటేసింది. బ్యాట్‌కు బంతి త‌గిలిన శ‌బ్ధం వినించింది. బంతి బౌండ‌రీ దాటింది. చూడ‌డానికి ఈ షాట్ అద్భుతంగా అనిపించింది. క‌ళ్లు చెదిరే ఈ షాట్‌ను చూస్తే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

అయితే ఇక్క‌డే నెటిజ‌న్లు కొన్ని అనుమనాలు వ్య‌క్తం వేస్తున్నారు. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ అనే పేరున్న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందు నెటిజ‌న్లు ఇది ప‌క్కాగా గ్రాఫిక్స్ చేసిన వీడియో అని ఒక‌రు, దీనినే వీడియో ఎడిటింట్ అంటార‌ని మ‌రొక‌రు కామెంట్ చేశారు. మ‌రి ఈ వీడియోలో ఎంత వ‌ర‌కు నిజం ఉందో మీరూ ఓసారి చూసి కాన్ఫామ్ చేయండి..

Also Read: Radhe Shyam: ప్రభాస్- పూజ హెగ్డే లేకుండా రొమాంటిక్ సాంగ్ తీసారట.. ఎలా అనుకుంటున్నారా..?

Natural star Nani: మాలీవుడ్ పై మనసుపడిన హీరో నాని.. అందుకోసమే ఆ హీరోని తీసుకున్నారా.?

Mumbai: ఆర్థిక రాజధానిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 15 మందికి తీవ్రగాయాలు..