Viral Video: నిద్రపోతున్న ప్రయాణికుల పక్కన పడుకొని ఇదేం పాడు పనులు రా..! సీసీ టీవీ ఫుటేజ్..
దొంగలు తెలివిమీరుతున్నారు. ఎదుటివారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే దొంగలు కాచుకొని కూర్చుంటారు. కాస్త ఆదమరిచి కనిపించారో అన్ని కాజేసి మాయమైపోతారు. అజాగ్రత్తగా ఉన్నా..నిద్రపోతున్నా సరిగ్గా అప్పుడే వాళ్ల టాలెంట్ అంతా చూపించి మన జేబులు కాళీ చేస్తారు.
దొంగలు తెలివిమీరుతున్నారు. ఎదుటివారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే దొంగలు కాచుకొని కూర్చుంటారు. కాస్త ఆదమరిచి కనిపించారో అన్ని కాజేసి మాయమైపోతారు. అజాగ్రత్తగా ఉన్నా..నిద్రపోతున్నా సరిగ్గా అప్పుడే వాళ్ల టాలెంట్ అంతా చూపించి మన జేబులు కాళీ చేస్తారు. విలువైన వస్తువులను ఎత్తుకుపోతారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇదే జరిగింది. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రసూతి ఆస్పత్రిలో సెల్ ఫోన్ దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. రాత్రివేళ రోగి బంధువుల సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్తూ..సీసీ కెమెరాలకు చిక్కారు. ఆస్పత్రిలో అడ్మిట్ ఉన్న పేషెంట్ అటెండర్లు..రాత్రి వేళ ఆస్పత్రి ఆవరణలో నిద్రిస్తుంటారు..అలా వారు నిద్రలోకి జారుకోవడం గమనించిన ఓ దొంగ తన చేతివాటం ప్రదర్శించాడు. తాను కూడా ఓ రోగి బంధువుల నటిస్తూ వారి పక్కన పడుకున్నాడు. కాస్త సమయం గడవగానే పక్కనున్న వ్యక్తి విలువైన సెల్‌ఫోన్ జేబులో కనిపించింది. అంతే వెంటనే ఆ స్మార్ట్ ఫోన్‌ని కాజేశాడు. ఆస్పత్రి ఆవరణలోనే దొంగతనం చేస్తున్న దృశ్యాలన్ని అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సెల్‌ఫోన్ చోరి చేసి పారిపోయాడు దొంగ. ఇకనైనా ఆస్పత్రి ఆవరణలో ఇలాంటి దొంగతనాలు జరగకుండా సరైన చర్యలు తీసుకోవాలంటున్నారు రోగులు, ప్రజలు. కట్టుదిట్టమైన జాగ్రత్తలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని బంధువులు కోరుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..