Viral Video: బిడ్డ జోలికి వస్తే తగ్గేదేలే.. పామును ఉరికించిన ఎలుక.. వైరల్ వీడియో..
Viral Video: బిడ్డ జోలికి వస్తే ఏ తల్లి ఊరుకోదు. తనలో శక్తినంతా కూడదీసుకొని మరీ బిడ్డ జోలికి వచ్చిన వారికి తగిన బుద్ధి చెబుతుంది. కన్న పేగుకు ఉండే బంధం అలాంటిది. అయితే ఇది కేవలం మనుషులకే పరిమితమా అంటే కాదని చెబుతోంది ఓ వీడియో....
Viral Video: బిడ్డ జోలికి వస్తే ఏ తల్లి ఊరుకోదు. తనలో శక్తినంతా కూడదీసుకొని మరీ బిడ్డ జోలికి వచ్చిన వారికి తగిన బుద్ధి చెబుతుంది. కన్న పేగుకు ఉండే బంధం అలాంటిది. అయితే ఇది కేవలం మనుషులకే పరిమితమా అంటే కాదని చెబుతోంది ఓ వీడియో. తన బిడ్డ జోలికి వచ్చిన శత్రువు తన కంటే బలమైందని, ప్రమాదరకమైందని తెలిసినా ఓ తల్లి ఎలుక చేసిన సాహసం నెటిజన్లను ఫిదా చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ పాము చిన్న ఎలుక పిల్లను నోట కరుచుకొని వేగంగా పరిగెడుతోంది. అదే సమయంలో దీనిని గమనించిన తల్లి ఎలుక తల్లడిల్లిపోయింది. తన కళ్ల ముందే బిడ్డ పాముకు ఆహారం కావడం చూడలేకపోయింది. వెంటనే పాముపై దాడికి దిగింది. పారిపోతున్న పామును వెంటాడి వెంటాడి కొరికింది. దీంతో ఆ పాము నోటిలో ఉన్న ఎలుకను విడిచిపెట్టింది. అయితే అక్కడితో ఆగని ఆ తల్లి ఎలుక, పామును రోడు దాటించేంత వరకు విడిచి పెట్టలేదు. పాము తమ దారిదాపుల్లో లేదని కాన్ఫామ్ చేసుకున్న తర్వాత మళ్లీ బిడ్డ ఎలుక దగ్గరకు వచ్చింది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Fight for survival and life is basic instinct every species in #nature #SurvivalOfFittest @ipskabra
Via:@IfsSamrat pic.twitter.com/QcUsgP7eLX
— Surender Mehra IFS (@surenmehra) January 22, 2022
నిజానికి ఈ వీడియో గతంలోనే నెట్టింట వైరల్‌గా మారింది. అయితే తాజాగా సురేందర్ మెహతా అనే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో మరోసారి ఈ వీడియో వైరల్‌గా మారింది. మనుగడ కోసం, బతకడం కోసం పోరాటం చేయడం ప్రతీ జీవి ప్రాథమిక స్వభావం అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఎలుక ధైర్యాన్ని హ్యాట్సాప్ చెబుతూనే మరోవైపు తల్లి ప్రేమ ఇలానే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
IPL 2022 వేదిక ముంబై.. ఈ 3 గ్రౌండ్‌లలో మ్యాచ్‌లు..! ఫిబ్రవరి 20న అధికారిక ప్రకటన..