Monkey Viral Video: కోతి తన మనవరాలిని ముద్దు చేస్తున్న బోనోబో అమ్మమ్మ.. ఎట్రాక్ట్ చేస్తున్న వైరల్ వీడియో..
Monkey Love: అసలు కంటే.. కొసరు ముద్దు అంటూ ఎవరికైనా తమ పిల్లలంటే ఎంత ఇష్టమో.. అంతకంటే ఎక్కువ ఇష్టం ప్రేమ మనవలు, మానవరాళ్ళపై ఉంటుంది. మనుషుల్లానే.. జంతువులు కూడా తమ పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతాయి. ఈ విషయం అనేకసార్లు..
Monkey Love: అసలు కంటే.. కొసరు ముద్దు అంటూ ఎవరికైనా తమ పిల్లలంటే ఎంత ఇష్టమో.. అంతకంటే ఎక్కువ ఇష్టం ప్రేమ మనవలు, మానవరాళ్ళపై ఉంటుంది. మనుషుల్లానే.. జంతువులు కూడా తమ పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతాయి. ఈ విషయం అనేకసార్లు.. పలు వీడియోల్లో చూస్తూనే ఉన్నాం.. అయితే ఇప్పుడు ఓ కోతి.. తన మనవరాలిని కూడా ఎంతో ప్రేమిస్తూ.. లాలిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కోతి పిల్లతో ఆడుకుంటున్న ఆడ కోతి
ముసలి ఆడ కోతి చిన్న కోతి పిల్లకు తినడానికి ఆహారం అందిస్తోంది. అంతేకాదు.. ఎంతో ముద్దుగా చేస్తూ.. ఈ వృద్ధ కోతి తన మనవరాళ్లతో ఆడుకుంటూ.. కోతి పిల్లకు చక్కిలిగింతలు పెట్టి అది నవ్వుతుంటే.. తాను సంతోష పడుతూ.. అన్ని రకాలుగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ వీడియో చూస్తుంటే నిజంగానే ఈ కోతులు కూడా మనుషుల్లానే తమ ప్రేమని వ్యక్తం చేస్తున్నాయనిపిస్తోంది. మనవరాలు, అమ్మమ్మ ఇద్దరూ చాలా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో కేవలం 45 సెకన్ల మాత్రమే ఉంది..
4 లక్షల మంది లైక్ చేయగా కోట్లాది మంది వీక్షించారు. 14 వేల మందికి పైగా నెటిజన్లు కామెంట్ చేశారు. మనుషుల మాదిరిగానే కోతులు కూడా ఉన్నాయి.. అయినప్పటికీ మనం వాటిని జూలో ఉంచుతామని ఒక వ్యక్తి కామెంట్ చేయగా.. గా ఈ కోతులు చాలా తెలివైనవని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఇలాంటి వీడియోలను చూసిన తర్వాత కూడా ప్రజలు జంతువులకు ఎలా హాని చేస్తారంటూ ఒక మహిళ కామెంట్ చేసింది. జంతువుల నుండి మనం ఇంకా చాలా నేర్చుకోవాలి అంటూ ఇంకొకరు.. ఇలా అనేక మంది కామెంట్ చేశారు.. మొత్తానికి మనవారు, అమ్మమ్మ ఆటలకు ఫిదా అయ్యారు.
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

