AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వావ్‌ వాటే క్రియేటివిటీ.. తాపీ పనిని ఇంత ఇన్నోవేటివ్‌గా కూడా చేయొచ్చా.. వైరల్‌ వీడియో..

Viral Video: హార్ఢ్ వర్క్‌ కాదు, స్మార్ట్‌ వర్క్‌ చేయాలని చెబుతుంటారు. గంటల తరబడి చేసే పనులను కూడా తెలివితో కొద్ది క్షణాల్లో చేయవచ్చని చెప్పడమే కాదు, కొందరు...

Viral Video: వావ్‌ వాటే క్రియేటివిటీ.. తాపీ పనిని ఇంత ఇన్నోవేటివ్‌గా కూడా చేయొచ్చా.. వైరల్‌ వీడియో..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 23, 2021 | 6:42 PM

Viral Video: హార్ఢ్ వర్క్‌ కాదు, స్మార్ట్‌ వర్క్‌ చేయాలని చెబుతుంటారు. గంటల తరబడి చేసే పనులను కూడా తెలివితో కొద్ది క్షణాల్లో చేయవచ్చని చెప్పడమే కాదు, కొందరు నిరూపిస్తుంటారు కూడా. ఎంతటి కష్టమైన పనినైనా తెలివితో సింపుల్‌ చేసి చూపిస్తుంటారు. ఇలా తెలివితో స్మార్ట్‌ వర్క్‌ చేసే వారి గురించి మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి స్మార్ట్‌ వర్క్‌కు సంబంధించిన ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది.

ఓ వ్యక్తి తాపీ చేతిన పట్టి సిమెంట్‌ ఫ్లోరింగ్‌ చేస్తున్నాడు. పని అంతా పూర్తయింది. కానీ మధ్యలో ఒక చోట ఎందుకో అతనికి పనిలో పర్‌ఫెక్షన్‌ అనిపించలేదు. అయితే మధ్యలోకి వెళ్లి చదును చేద్దామంటే మిగతా ప్లేస్‌లో అప్పటికే చేసిన ఫ్లోరింగ్‌ చెరిగిపోతుంది. దీంతో అతనికి ఓ అద్భుత ఆలోచన వచ్చింది. ఓ చిన్న సైజ్‌ జేసీబీలాంటి వాహనాన్న తీసుకొని దానికి ఒక పెద్ద కర్రను అమర్చాడు.. ఆ కర్రపై పడుకొని ఎంచక్కా తాపీతో ఫ్లోరింగ్‌ చేసేశాడు.

ఇక ఆ బండిని ఆపరేటింగ్‌ చేస్తున్న వ్యక్తులు అతని డైరెక్షన్‌ మెరకు అటు, ఇటు కదిపారు. ఇలా అంతటి హార్డ్‌ వర్క్‌ను కూడా స్మార్ట్‌గా చేశేశాడు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతగాడి తెలివి చూసిన నెటజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: TDP Leader Pattabhi: పట్టాభికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు లైవ్ వీడియో

చలికాలం ఊపిరితిత్తులు జాగ్రత్త..! దగ్గుతో పాటు ఈ లక్షణాలు ఉన్నాయా..?

Viral Video: అనుకోని ఆపదలో ఇరుకున్న పిల్ల ఏనుగు.. తల్లడిల్లిన ఆ తల్లి ఏనుగు ఏం చేసిందంటే..