యూపీ ఆలయంలో తొక్కిసలాట.. ముందస్తు హోలీ వేడుకల్లో అపశృతి

యూపీ ఆలయంలో తొక్కిసలాట.. ముందస్తు హోలీ వేడుకల్లో అపశృతి

Phani CH

|

Updated on: Mar 19, 2024 | 7:51 PM

ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఆలయంలో నిర్వహించిన ముందస్తు హోలీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలోని మెట్ల రెయిలింగ్‌ విరిగిపడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్సానాలోని రాధా రాణి ఆలయంలో ఆదివారం సాయంత్రం ముందస్తు హోలీ వేడుకలు ప్రతి సంవత్సరం జరపడం రివాజుగా వస్తోంది.

ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఆలయంలో నిర్వహించిన ముందస్తు హోలీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలోని మెట్ల రెయిలింగ్‌ విరిగిపడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్సానాలోని రాధా రాణి ఆలయంలో ఆదివారం సాయంత్రం ముందస్తు హోలీ వేడుకలు ప్రతి సంవత్సరం జరపడం రివాజుగా వస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తుల కోసం లడ్డూను పంపిణీ చేస్తుండగా.. ప్రసాదం కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ సమయంలో ఆలయంలో మెట్ల రెయిలింగ్‌ ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘటనలో 22 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆలయంలో రద్దీని నియంత్రించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లు అధికారులు వివరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భోజనం పెట్టడం లేదు.. ఫోన్లు లాక్కున్నారు.. కాపాడండి ప్లీజ్‌..

నెట్టింట కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. ఏం జరిగిందంటే ??

అంతరిక్షంలో భారత్‌ స్పేస్‌ స్టేషన్‌.. 2040 కల్లా పూర్తి చేసేలా సన్నాహాలు

Naga Chaitanya: ధూత సీక్వెల్‌కు రెడీ అంటోన్న నాగచైతన్య

కుక్కలకు పార్వో వైరస్.. మనుషులకు పొంచి ఉన్న ముప్పు