ఆత్మగా చిన్నారి వద్దకు వచ్చిన పిల్లి..? వెన్నులో వణుకు పుట్టిస్తోన్న వీడియో
ఒక చిన్నారి పడకగదిలో సీసీటీవీలో కనిపించిన అద్భుత దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం అవుతోంది. ఆ ఫుటేజ్‌లో చిన్నారి మంచం మీద పడుకుని ఉండగా.. పక్కనే ఓ పిల్లి ఆకారంలో ఉన్న నీడ రూమ్‌లోకి వచ్చి ఆమె దగ్గరికి వస్తుంది. సీసీ కెమెరాలో దానిని చూసిన తల్లి..వెంటనే చిన్నారి రూమ్‌కి పరుగెత్తింది.
“ఇక్కడ పిల్లి ఉండాలిగా.. అదేదీ?’అని చిన్నారిని అడగగా, ‘నా వద్దకు ఏ పిల్లీ రాలేదు. అయితే.. ఆ కిటికీ దగ్గర ఏదో ఉంది’ అని ఆ చిన్నారి జవాబు చెప్పింది. ఆ మాట వినగానే.. పాప తల్లిదండ్రులకు కొన్ని రోజుల క్రితం చనిపోయిన తమ పెంపుడు పిల్లి గుర్తొచ్చింది. దీంతో.. వారి చనిపోయిన పెంపుడు పిల్లే.. పాప మీద ప్రేమతో ఆత్మ రూపంలో వచ్చిందని నెటిజన్లు ఊహించుకుంటున్నారు.ఈ ఘటనపై చాలామంది తమ అనుభవాలూ షేర్ చేశారు. “నాకూ మా పెట్ చనిపోయిన కొన్నాళ్ల వరకు అలాగే అనిపించేది’అని ఒకరు కామెంట్ పెట్టారు. “పిల్లలకి కనిపించే అలాంటి వాటిని మనం లైట్ తీసుకుంటాం గానీ.. వాటిలో చాలా నిజం ఉంటుంది’అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఒకవేళ అది నిజంగా ఆ పిల్లి ఆత్మే గనక అయితే.. అది ఏదో చెడు నుంచి ఆ చిన్నారిని కాపాడటానికే వచ్చి ఉంటుంది’అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చారు. అయితే ఈ సంఘటన సరిగ్గా ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే సమాచారం లేకున్నా.. ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ క్లిప్ ఎవరో కావాలని క్రియేట్ చేసిందని.. మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పాత, చినిగిన బట్టలు దాస్తున్నారా వీడియో
కూరగాయల్ని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదంటే?
విశ్వానికి ముగింపు ఎప్పుడంటే వీడియో
తేళ్ల పంచమి.. వాటిని ముఖంపై వేసుకుని ఆటలు.. వామ్మో ఇదేం పండుగ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
