పుణ్యానికి పోతే.. పాపం ఎదురైంది.. కట్ చేస్తే జైలు పాలయ్యాడు
మంచి చేయబోతే చెడు ఎదురైందనే నానుడి మనలో చాలామంది వినే ఉంటారు. అది చాలాసార్లు నిజం కూడా అవుతుందనే ఘటన భోపాల్‌లో జరిగింది. మానవత్వంతో కష్టాల్లో ఉన్న మరో మనిషికి సాయం చేయాలని వెళ్లిన ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. వైద్యులు, పోలీసుల తప్పిదం కారణంగా ఆ అమాయకుడు నేరస్తుడనే ముద్రతో కటకటాల పాలయ్యాడు. భోపాల్‌లోని ఆదర్శనగర్‌కు చెందిన రాజేశ్ విశ్వకర్మ సాధారణ కూలీ.
అక్కడి ఓ స్లమ్ ఏరియాలో ఓ అద్దె ఇంటిలో బతుకు సాగిస్తున్నాడు.అయితే.. నిరుడు జూన్‌లో అతడు ఉండే ఇంటికి పక్కనే నివసించే ఓ మహిళ అనారోగ్యానికి గురికావడంతో.. రాజేశ్ మానవతా దృక్పథంతో ఆమెను దగ్గరలోని ఒక ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సమయంలో రాజేశ్ భయపడుతూ సమాధానాలు చెప్పడంతో అతడే ఆమెను.. హత్య చేసి ఉంటాడని భావించి, కేసు పెట్టి, కోర్టులో హాజరు పరచగా.. కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. రాజేశ్‌ను అరెస్ట్ చేసిన 9 రోజుల వరకు పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. నిరుపేద అయిన రాజేశ్ తరపున వాదించేందుకు ఏ లాయరూ ముందుకు రాకపోవటంతో.. అతడి వాదన వినిపించేందుకు కోర్టు ఒక ప్రభుత్వ న్యాయవాదిని కేటాయించింది. అతడు రాజేశ్ నుంచి అన్ని వివరాలు రాబట్టే క్రమంలో ఆమె.. అనారోగ్యంతో చనిపోయిందనే మెడికల్ రిపోర్టును గమనించాడు. అయితే..పోస్టుమార్టం రిపోర్టులో ఆమె గొంతు కోయటం వల్ల మరణించినట్లుగా ఉందని కూడా గమనించిన ఆ లాయర్.. ఈ రెండు రిపోర్టుల మీద ఫోకస్ పెట్టారు. చివరికి.. పోలీసులు, పోస్టుమార్టం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించుకుని.. కోర్టుకు ఇదే విషయాన్ని ఆధారాలతో వివరించి.. రాజేశ్ నిర్దోషి అని వాదించాడు. సాక్షాలను పరిశీలించిన మీదట.. కోర్టు రాజేశ్ నిర్దోషి అని ప్రకటించి..అతడి విడుదలకు పోలీసులను ఆదేశించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆఫీస్ లో మీటింగ్ అయ్యింది.. కట్ చేస్తే బిల్డింగ్ పైనుంచి దూకేసిన టెకీ
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

