షాకింగ్ : హీరోయిన్ బ్యాగ్ నుంచి రూ.70 లక్షల నగల చోరీ వీడియో
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలాకు లండన్‌లో ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. వింబుల్డన్ టోర్నీకి హాజరై భారత్‌కు తిరుగు ప్రయాణమైన సమయంలో ఆమె లగ్జరీ సూట్‌కేస్ గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో చోరీకి గురైంది. ఆ సూట్‌కేస్‌లో సుమారు రూ.70 లక్షల విలువైన నగలు ఉన్నట్లు ఊర్వశి తెలిపారు. కాగా, జులై నెల ప్రారంభంలో లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ 2025లో మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌కు ఊర్వశి హాజరయ్యారు.
తన విలువైన వస్తువులు పోవడాన్ని ఊర్వశి గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు ద్వారా తెలియజేశారు. ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, విమానాశ్రయ సిబ్బంది నుంచి తగిన సహకారం అందలేదని వాపోయారు. గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్ వర్గాల నుంచి ఇప్పటివరకు స్పందన లేదన్నారు. కాగా, ఊర్వశి రౌతేలాకు ఇంతకుముందు కూడా ఇలాంటి కొన్ని ఘటనలు ఎదురయ్యాయి. 2023లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో రూ. 45 లక్షల విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు. అలాగే గతంలో ఆమె ఐఫోన్ కూడా చోరీకి గురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :
పాత, చినిగిన బట్టలు దాస్తున్నారా వీడియో
కూరగాయల్ని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదంటే?
విశ్వానికి ముగింపు ఎప్పుడంటే వీడియో
తేళ్ల పంచమి.. వాటిని ముఖంపై వేసుకుని ఆటలు.. వామ్మో ఇదేం పండుగ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

