ఓర్నీ.. కుర్రాళ్లు సల్లగుండా.. చీట్ చేసి అలా ఎలా ఎస్కేప్ అయ్యరురా బాబు..
దొంగలు పెట్రోలు బంకులను టార్గెట్ చేశారా అంటే అవుననే అనిపిస్తోంది. అనంతపురంలో రెండు పెట్రోలు బంకుల్లో చోరీకి పాల్పడి లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్తే... మరోచోట కొందరు బంకులో పెట్రోలు కొట్టించుకొని మనీ ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నట్టు నటిస్తూ.. బంక్ సిబ్బందికి టోకరా ఇచ్చి పారిపోయారు. అలా వెళ్లిన వాళ్లు ఎంతకీ తిరిగి రాకపోవడంతో అవాక్కయి చూస్తుండిపోయాడు పెట్రోలు కొట్టిన బంక్ సిబ్బంది.
ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు హరిహర మహల్ సెంటర్ లోని పెట్రోల్ బంక్‌కి ఉదయం పది గంటల సమయంలో ఇద్దరు యువకులు పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చారు. అక్కడి సిబ్బంది ఎంత కొట్టాలని అడిగారు. వెయ్యి రూపాయల పెట్రోలు కొట్టమని చెప్పగా పెట్రోల్ కొట్టిన అతను డబ్బులు అడిగాడు. ఫోన్ పే చేస్తామని స్కానర్ అడిగారు. అతను స్కానర్ చూపించాడు. అయితే స్కాన్ చేయడం.. ఎమౌంట్ పేచేయడానికి ట్రై చేయడం.. అది కాకపోవడం.. మళ్లీ మళ్లీ స్కాన్ చేయడం.. యువకులు ఇద్దరూ తమ ఫోన్లలో మార్చి ఎమౌంట్ పే చేయడానికి ట్రై చేస్తున్నట్టు నటించారు. కొద్దిసేపటికి పేమెంట్ అయిపోయిందని ఫోన్ చూపించి అక్కడినుంచి ఉడాయించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అచ్చం మైఖేల్ జాక్సన్‌లా డాన్స్ అదరగొట్టిన ప్రొఫెసర్
ఇలాంటి భర్తకు దండేసి దండం పెట్టాలి.. మరీ ఇంత త్యాగం ఎలా చేశావ్ మావ..
Bangkok Pilla: భూకంపం ఏమో కానీ.. ఈమెకు మాత్రం భలే గిరాకీ పెరిగింది