ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నుంచి కందిపప్పు, రాగులు ఉచితంగా అందించనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పోషకాహారం అందించడం లక్ష్యం. మూడు నెలల కందిపప్పు, ఏడాది రాగులు అందించనున్నారు. క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలో విడుదల చేయనున్నారు.