Guntur solar car: వినూత్న సృష్టి.. పైసా ఖర్చు లేకుండా కారులో షికారు..! వైరల్ అవుతున్న వీడియో..

Guntur solar car: వినూత్న సృష్టి.. పైసా ఖర్చు లేకుండా కారులో షికారు..! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 06, 2023 | 5:56 PM

రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ కు బదులుగా ప్రత్యామ్నాయంపై మళ్లుతున్నారు జనం. విద్యుత్ తో నడిచే


ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రికల్ బైక్స్, వాహనాలను రూపొందిస్తూ వాహనదారులను ఆకట్టుకుంటున్నారు. అయితే విద్యుత్ రేట్లు కూడా భారీగా పెరిగిన ఈ సమయంలో పైసా ఖర్చు లేకుండా సోలార్ సహాయంతో వాహనాలను నడిపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు తెనాలికి చెందిన ఓ యువకుడు. పెట్రోల్, విద్యుత్ అవసరం లేకుండా కేవలం సూర్య రశ్మి సహాయంతో కారులో హాయిగా షికారుకు వెళ్లవచ్చంటున్నారు.ఇక్కడ కనిపిస్తున్న ఈ కారుని చూడండి, దీనిని తయారు చేసిన వెంకట్ నారాయణ ఒక సామాన్య కార్మికుడు. ఈయన మదిలో నుంచి మెదిలింది ఈ సోలార్ కారు. బ్యాటరీ కారు తీసుకుని దానికి సోలార్ ప్యానల్స్‌ను బిగించి సోలార్ కారుగా మార్చేశారు. ఎండ ఉన్నంత సేపు కారు పైసా ఖర్చు లేకుండా నడుస్తుంది. సూర్య రష్మి తగ్గిపోగానే వెంటనే బ్యాటరీ నుంచి పవర్ తీసుకుని కారు నడుస్తుంది. సుమారు 150 కిలోమీటర్ల వరకు పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేయవచ్చంటున్నారు వెంకటనారాయణ. ఇద్దరు ప్రయాణించే ఈ చిన్న కారు సెకండ్ హ్యాండ్ లో తీసుకొని తానే సొంతగా సోలార్ ప్యానెల్ బిగించి ప్రయాణిస్తున్నానని కారు నడిపించి చూపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 06, 2023 05:56 PM