భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక

భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక

Phani CH

|

Updated on: Dec 16, 2024 | 8:39 PM

అంతరిక్షంలో తిరుగుతున్న ఒక భారీ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ ఆస్టరాయిడ్ ఢీకొంటే దారుణమైన ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ ఆస్టరాయిడ్ పై ఇస్రో పరిశోధన చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వివరాలను ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తాజాగా వెల్లడించారు.

అంతరిక్షంలో తిరుగుతున్న ఆస్టరాయిడ్ అపోఫిస్ భవిష్యత్తులో భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 450 మీటర్ల పొడవు, 170 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్… 2029 ఏప్రిల్ 13న భూమికి అత్యంత దగ్గరగా.. అంటే కేవలం 32 వేల కిలోమీటర్ల సమీపం నుంచి దూసుకువెళుతుందని తేల్చారు. అంటే భూమి చుట్టూ స్థిర కక్ష్యలో తిరిగే కమ్యూనికేషన్ శాటిలైట్ల కంటే కూడా ఇది దగ్గరగా వస్తుండడం గమనార్హం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి

బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!