బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!
అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌ను వన్య మృగాల సంచారం భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఆసిపాబాద్ జిల్లాను నెల రోజులుగా పులుల భయం వెంటాడుతుంటే.. నిర్మల్ జిల్లాను మొసళ్ల భయం వణికిస్తోంది. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్ వద్ద నడి రోడ్డుపై మొసలి కనిపించడంతో గజగజా వణికిపోయారు ప్రయాణికులు.
అదే సమయంలో బ్యారేజ్ లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు సైతం రెండు మొసళ్లు కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో స్థానికులను అప్రమత్తం చేశారు. గురువారం సాయంత్రం సదర్మాట్ బ్యారేజ్‌పైన రోడ్డుపై సంచరిస్తూ ప్రయాణికుల కంటపడింది మొసలి. అప్రమత్తమైన ప్రయాణికులు స్థానికులకు సమాచారం అందించారు. వారు అటవీశాఖ అధికారులకు విషయం తెలుపగా బ్యారేజీలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. బ్యారేజ్‌పై వాహనదారులను పోలీసులు అలర్ట్ చేశారు. మొసళ్ల సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు.. పోలీస్ సిబ్బంది అలెర్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిలియన్ సం.రాలు పట్టే లెక్కను 5 నిమిషాల్లో చేసేస్తుంది.. అద్భుతం అన్న మస్క్
మతగురువు రాసలీలలు.. ఆధ్యాత్మిక భార్యలు అంటూ 20 మందిపై..
ట్రంప్ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్ న్యూస్ అవుతుందా ??