ధోని ఎంట్రీతో దద్దరిల్లిన స్టేడియం.. యాపిల్‌ వాచ్‌ వార్నింగ్ అలర్ట్

ధోని ఎంట్రీతో దద్దరిల్లిన స్టేడియం.. యాపిల్‌ వాచ్‌ వార్నింగ్ అలర్ట్

Phani CH

|

Updated on: Apr 20, 2024 | 9:06 PM

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి, ఆయన ఆటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోనీని చూడడానికి వందల కిలోమీటర్లు అష్టకష్టాలు పడి స్టేడియానికి వచ్చే అభిమానులు ఎందరో.. అలాంటి ఆటగాడు బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెడుతుంటే స్టేడియం హోరెత్తిపోవడంలో ఆశ్చర్యమేముంటుంది? శుక్రవారం కూడా ఇలాగే స్టేడియం దద్దరిల్లిపోయింది.

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి, ఆయన ఆటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోనీని చూడడానికి వందల కిలోమీటర్లు అష్టకష్టాలు పడి స్టేడియానికి వచ్చే అభిమానులు ఎందరో.. అలాంటి ఆటగాడు బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెడుతుంటే స్టేడియం హోరెత్తిపోవడంలో ఆశ్చర్యమేముంటుంది? శుక్రవారం కూడా ఇలాగే స్టేడియం దద్దరిల్లిపోయింది. ధోని ధోని అంటూ అభిమానులు కేకలు వేయడంతో స్టేడియంలో శబ్ద తీవ్రత 95 డెసిబిల్స్ దాటిందని, దీంతో తన యాపిల్ వాచ్ అలర్ట్ చేసిందని సౌతాఫ్రికా ఆటగాడు డీ కాక్ భార్య శాషా చెప్పారు. దీనికి సంబంధించి శాషా ఓ ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. శబ్ద తీవ్రత ఓ పది నిమిషాలు అలాగే కొనసాగితే తాత్కాలికంగా వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని యాపిల్ వాచ్ హెచ్చరించిందని తెలిపారు. లక్నోలోని ఎకనా స్టేడియంలో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన శాషా.. ధోనీ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయారు. సీఎస్కే తరఫున చివరి ఓవర్లలో ధోనీ బ్యాటింగ్ కు వస్తుంటే ఎకనా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పారు. ధోనీ ధోనీ అంటూ అభిమానుల అరుపులతో శబ్ద తీవ్రత పీక్ కు వెళ్లిపోయిందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్-పాక్ సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా ?? నోస్ట్రడామస్ జోస్యం నిజమవుతుందా ??

TTD: శేషాచలం అడవుల్లో మంటలు.. వీడియో ఇదిగో

ఆసుపత్రిలో నటుడు.. విషం ఇచ్చారని ఆరోపణ

వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్‌.. రాజాసాబ్ వీడియో లీక్