భారత్-పాక్ సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం
పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు వద్ద చైనా డ్రోన్ కనిపించి కలకలం రేపింది. అమృత్‌సర్ జిల్లాలో 500 గ్రాముల హెరాయిన్‌తో కనిపించిన ఈ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ అనుమానిత ప్రదేశాల్లో గాలించగా నిన్న సాయంత్రం 4.45 గంటల సమయంలో డ్రగ్ ప్యాకెట్‌తో ఉన్న ఈ డ్రోన్ కనిపించింది. డ్రోన్‌కు డ్రగ్ ప్యాకెట్, టార్చ్‌లైట్‌ను టేపుతో చుట్టారని అధికారులు తెలిపారు.
పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు వద్ద చైనా డ్రోన్ కనిపించి కలకలం రేపింది. అమృత్‌సర్ జిల్లాలో 500 గ్రాముల హెరాయిన్‌తో కనిపించిన ఈ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ అనుమానిత ప్రదేశాల్లో గాలించగా నిన్న సాయంత్రం 4.45 గంటల సమయంలో డ్రగ్ ప్యాకెట్‌తో ఉన్న ఈ డ్రోన్ కనిపించింది. డ్రోన్‌కు డ్రగ్ ప్యాకెట్, టార్చ్‌లైట్‌ను టేపుతో చుట్టారని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రోన్ చైనా తయారీ ‘డీజేఐ మావిక్ 3 క్లాసిక్’ అనీ భారత్-పాక్ సరిహద్దులో డ్రోన్లతో డ్రగ్స్ రవాణా చేసే కుట్రకు పాకిస్తాన్ పాల్పడుతోందని తెలిపారు. సరిహద్దు వద్ద డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ దొడ్డిదారిన డ్రగ్స్ అక్రమ రవాణాకు తెగబడుతోంది . గతంలో కూడా భారీ ఎత్తున డ్రగ్స్‌ను భారత సరిహద్దు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన 2.6 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది BSF సిబ్బంది. సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ నుంచి ఈ పార్సిల్‌ను కింద పడేసినట్లు అధికారులు తెలిపారు. చైనా డ్రోన్‌ను గుర్తించిన BSF సిబ్బంది దాన్ని కాల్చివేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా ?? నోస్ట్రడామస్ జోస్యం నిజమవుతుందా ??
TTD: శేషాచలం అడవుల్లో మంటలు.. వీడియో ఇదిగో
ఆసుపత్రిలో నటుడు.. విషం ఇచ్చారని ఆరోపణ
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

