పూటగడవడం కష్టంగా ఉంది.. ఏదైన ఉద్యోగం ఇప్పించండి ప్లీజ్.. అంటున్న భారత క్రికెటర్
భారత క్రికెట్ అభిమానుల్లో వినోద్ కాంబ్లీ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. స్కూల్ క్రికెట్లో సచిన్‌తో కలిసి ప్రపంచ రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ముంబై మాజీ ఆటగాడు కాంబ్లీ..
భారత క్రికెట్ అభిమానుల్లో వినోద్ కాంబ్లీ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. స్కూల్ క్రికెట్లో సచిన్‌తో కలిసి ప్రపంచ రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ముంబై మాజీ ఆటగాడు కాంబ్లీ.. ఆ తర్వాత భారత క్రికెట్లోనూ మెరిశాడు. ఇంత గుర్తింపు పొందిన కాంబ్లీ ప్రస్తుతం చాలీచాలని జీతంతో బతుకీడుస్తున్నాడు. అవును మీరు విన్నది నిజమే.. పూట గడవడం చాలా కష్టంగా ఉందని, ఏదైన పని ఉంటే ఇప్పించాలంటూ బీసీసీఐను వేడుకుంటున్నాడు. క్రికెట్‌కు సంబంధించి ఏదైనా పని ఉంటే ఇప్పించాలని బీసీసీఐని వేడుకుంటున్నాడు. బీసీసీఐ ఇస్తున్న ముప్సై వేల పెన్షనే తనను తన కుటుంబాన్ని బతికిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తాగుడుకు బానిస కాలేదని.. సోషల్‌గా మాత్రమే డ్రింక్ చేస్తానని కాంబ్లీ తెలిపాడు. తన చిన్ననాటి స్నేహితుడు సచిన్‌కు తన గురించి అంతా తెలుసని.. కానీ అతడి నుంచి తానేం ఆశించడం లేదన్నాడు. సచిన్ తనకు టెండుల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీలో కోచ్‌గా ఉద్యోగమిచ్చాడన్నారు. సచిన్ చాలా మంచి స్నేహితుడు. అతడు నాకెప్పుడూ అండగా నిలిచాడని కాంబ్లీ తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త జంటకు బంధువుల వింత ప్రశ్న..! సిగ్గుతో ఊగిపోయిన నవవధువు
ప్రమాదంలో ఉన్న మహిళ !! అది చూసిన శునకం ఏం చేసిందో తెలుసా ??
Viral Video: వేడివేడిగా పూరి ఆర్డర్.. సర్వ్ చేసింది చూసి షాక్ !!
Chiranjeevi Birthday: బర్త్‌డే విషెస్ అంటే ఇది.. వింటే విజిల్స్ పడాల్సిందే