Viral Video: వేడివేడిగా పూరి ఆర్డర్.. సర్వ్ చేసింది చూసి షాక్ !!
టిఫిన్ తిందామని పూరీ ఆర్డరిస్తే… అందులో పురుగులొచ్చాయి.. ఓ కస్టమర్ ఇచ్చిన కంప్లయింట్‌తో ఒకటీ, రెండు కాదు.. కస్టమర్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నాలుగు రెస్టారెంట్లు మూతపడ్డాయి.
టిఫిన్ తిందామని పూరీ ఆర్డరిస్తే… అందులో పురుగులొచ్చాయి.. ఓ కస్టమర్ ఇచ్చిన కంప్లయింట్‌తో ఒకటీ, రెండు కాదు.. కస్టమర్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నాలుగు రెస్టారెంట్లు మూతపడ్డాయి. చెన్నైలోని ఓ మాల్‌లో కొందరు రెస్టారెంట్‌కు వెళ్లారు. పూరీ ఆర్డర్ ఇచ్చారు. అయితే.. అందులో పురుగులు కనిపించాయి. ఇదేంటని రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. అటునుంచి సమాధానం రాలేదు. దీంతో కస్టమర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు చేశారు. పూరీ పిండిని చెక్ చేయడంతో పిండిలోనే పురుగులు ఉండటం చూసి అధికారులు కంగుతిన్నారు. వాటిలో కొన్ని బతికే ఉన్నాయి. మరికొన్ని చచ్చిపోయి పూరీలో కలిసిపోయాయి. మరీ ఇంత దారుణంగా పూరీలు చేస్తున్నారా అంటూ ఆ రెస్టారెంట్‌ని సీజ్ చేశారు అధికారులు. కథ ఇంతటితో ఆగలేదు. ఒక రెస్టారెంట్‌నే కాదు.. ఆ మాల్‌లో ఉన్న మిగతా రెస్టారెంట్లలోనూ తనిఖీలు చేశారు. అన్ని చోట్ల పురుగుల పూరీ పిండే కనిపించింది. పది రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తే.. నాలుగింటిలో వరెస్ట్ ఫుడ్ కనిపించింది. కుళ్లిన మాంసం, పాడైపోయిన భోజనం దొరకడంతో నాలుగు రెస్టారెంట్లను సీజ్ చేశారు. వాటి యజమానులకు నోటీసులు జారీ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi Birthday: బర్త్‌డే విషెస్ అంటే ఇది.. వింటే విజిల్స్ పడాల్సిందే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

