Viral Video: భయ్యా.. ఏంటా క్యాచ్.. దిమ్మతిరిగిపోయింది.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
క్రికెట్‌లో కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే, ఈ మధ్య పొట్టి క్రికెట్ మొదలయ్యాక ఇలాంటి సన్నివేశాలు మరింతగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు చూడబోయే వీడియో మాత్రం మన గుండెలకు హత్తుకోవడం మాత్రం ఖాయం. ఎందుకంటే.. అది వికలాంగుల మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన.
క్రికెట్‌లో కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే, ఈ మధ్య పొట్టి క్రికెట్ మొదలయ్యాక ఇలాంటి సన్నివేశాలు మరింతగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు చూడబోయే వీడియో మాత్రం మన గుండెలకు హత్తుకోవడం మాత్రం ఖాయం. ఎందుకంటే.. అది వికలాంగుల మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన. వికలాంగుల మ్యాచ్ అంటే ఆసక్తి ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ, ఈ మ్యాచ్‌లో ఓ బౌలర్ ఏకంగా ప్రొఫెషనల్ క్రికెట్‌లా ఆడి తన సత్తా చాటి, ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాడు. ప్రత్యేక సామర్థ్యం ఉన్న ఓ బౌలర్ ఒంటి చేత్తో క్యాచ్ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయానికి వెళ్తే.. ఈ వీడియో క్లిప్‌లో, వికలాంగులైన బౌలర్ బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతిని అందుకునేందుకు చాలా రిస్క్ చేసి మరీ ఔట్ చేశాడు. అతను కర్ర సహాయంతో రన్నింగ్ చేసి బౌలింగ్ చేయడం ఒక ఎత్తైతే.. లాంగ్-ఆఫ్‌లోకి వెళ్తున్న బంతిని వెంటాడి ఒంటి చేత్తో పట్టుకుని ఔరా అనిపించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్ పాట తో వైద్యం.. వీడియో
wallnuts: రోజూ అరకప్పు వాల్‌నట్స్ తీసుకుంటే గుండె జబ్బులను జయించినట్లే.. వీడియో