AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెమీ ఫైనల్‌కు ముందు షాక్.. రోహిత్ శర్మకు అవుట్ ??

సెమీ ఫైనల్‌కు ముందు షాక్.. రోహిత్ శర్మకు అవుట్ ??

Phani CH
|

Updated on: Nov 08, 2022 | 8:17 PM

Share

టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌ పోరుకు సిద్ధమవుతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు నుంచి బంతిని అందుకునే క్రమంలో రోహిత్ శర్మ మణికట్టుకు బాల్ వేగంగా తాకింది.

టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌ పోరుకు సిద్ధమవుతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు నుంచి బంతిని అందుకునే క్రమంలో రోహిత్ శర్మ మణికట్టుకు బాల్ వేగంగా తాకింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడుతూ రోహిత్ తల్లడిల్లిపోయాడు. వెంటనే ప్రాక్టీస్‌ను ఆపేసి మధ్యలోనే వెళ్లిపోయి పక్కకు కూర్చున్నాడు. కుడి చేతికి ఐస్ ప్యాక్ పెట్టుకుని కూర్చున్నాడు. దూరం నుంచి ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్‌ చూస్తు కూర్చున్నాడు. ఆ టైమ్‌లో కూడా హిట్ మ్యాన్‌ నొప్పితో బాధపడుతూనే కనిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గాయం తీవ్రత తెలియనప్పటికీ.. కీలకమైన ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ ముందు రోహిత్ శర్మ గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శర్మ గాయం తీవ్రమైతే.. కచ్చితంగా టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. కాగా, ప్రస్తుత టీ20 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ హిట్ అయినా.. బ్యాట్స్‌మెన్‌గా విఫలమయ్యాడు. అయితే, చేతికి దెబ్బతగిలాక రెస్ట్ తీసుకున్న రోహిత్.. ఈవెనింగ్ సెషన్‌లో మళ్ళీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ఒకింత ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది. సెమీస్‌ పోరులో ఇంగ్లాండ్‌తో రోహిత్ అదరగొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. ఈ రాశి వారికి ఇది జాక్‌పాట్‌..

Allu Arjun: ప్రతీ ఫంక్షన్‌లో.. ఇలాంటోడు ఒకడు ఉంటాడే..

Janhvi Kapoor: జాన్వీ మదిలో సమ్‌థింగ్.. సమ్‌థింగ్

Allu Arjun: ప్రాణ మిత్రుడి మాటలకు ఏడ్చేసిన బన్నీ !!

Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్‌ !!

 

Published on: Nov 08, 2022 08:17 PM