CM Revanth Reddy: డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.

CM Revanth Reddy: డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 13, 2024 | 9:23 PM

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్న CM రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఫ్యూచర్‌ కార్‌లో జర్నీ చేశారు. డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ఎక్కి ఆయన ప్రయాణం చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో పర్యటన సందర్భంలో ఆయన ఈ కారు ఎక్కారు.

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్న CM రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఫ్యూచర్‌ కార్‌లో జర్నీ చేశారు. డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ఎక్కి ఆయన ప్రయాణం చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో పర్యటన సందర్భంలో ఆయన ఈ కారు ఎక్కారు. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన జర్నీ చేశారు. డ్రైవర్‌ అవసరం లేకుండా సెన్సార్లు, GPS ట్రాకింగ్‌తో కారు ఎలా ప్రయాణిస్తుందో అడిగి తెలుసుకున్నారు. మరో వైపు తెలంగాణలో టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టాలని రేవంత్‌ రెడ్డి, దక్షిణకొరియా కంపెనీలను కోరారు. సియోల్‌ కొరియా టెక్స్‌టైల్‌ సమాఖ్య నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. 25 ప్రధాన టెక్స్‌టైల్‌ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వరంగల్‌లో ఉన్న టెక్స్‌టైల్‌ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుడులను ఆకర్షించడానికి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు ఇచ్చేలా, మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషిచేస్తామని చెప్పారాయన.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.