లోక్ సభ పోలింగ్ కు కౌంట్‌డౌన్ మొదలైంది. సోమవారం తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ను నాశనం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని ఏ సీఎం కూడా చెప్పరని.. తాను ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కరెంట్ పోలేదంటూ పేర్కొన్నారు. ఇప్పుడు చిన్నపాటి వర్షానికే కరెంట్ కోతలు మొదలయ్యాయన్నారు. పాపం చేసిన కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సిందే.. చిల్లర రాజకీయాలతో సమయం వృధా చేస్తున్నారంటూ కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పాత రోజులు మళ్లీ తీసుకొచ్చిందని.. విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారంటూ కేసీఆర్ మండిపడ్డారు. జనరేటర్లు, ఇన్వెర్టర్లు తీసుకువచ్చారు.. కరెంట్ లేక లక్షల ఎకరాలు ఎండిపోయాయని.. ఆవేదన వ్యక్తంచేశరాు. తమ హయాంలో హైదరాబాద్‌ను పవర్ హైలాండ్‌గా చేశామని.. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని.. గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా మారాయంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ సభల్లో ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి.. కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందంటూ కేసీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..