Kejriwal Press Meet: జైలు నుంచి విడుదలయ్యాక సీఎం కేజ్రీవాల్ తొలి ప్రెస్ మీట్..

ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చిన్న పార్టీ అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ పార్టీ స్థాపించి కేవలం 10 సంవత్సరాలు అయిందన్నారు. ప్రస్తుతం తన పార్టీ రెండు రాష్టాల్లో అధికారంలో కొనసాగుతోందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి సారి మీడియా సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ఇదే తొలి ప్రెస్ మీట్. తన పార్టీని అంతం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలోని దాదాపు 4 కీలక నేతలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు.

Kejriwal Press Meet: జైలు నుంచి విడుదలయ్యాక సీఎం కేజ్రీవాల్ తొలి ప్రెస్ మీట్..

|

Updated on: May 11, 2024 | 1:57 PM

ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చిన్న పార్టీ అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ పార్టీ స్థాపించి కేవలం 10 సంవత్సరాలు అయిందన్నారు. ప్రస్తుతం తన పార్టీ రెండు రాష్టాల్లో అధికారంలో కొనసాగుతోందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి సారి మీడియా సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ఇదే తొలి ప్రెస్ మీట్. తన పార్టీని అంతం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలోని దాదాపు 4 కీలక నేతలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు. ఏడాది కాలంగా ఈ అరెస్టులు జరుగుతున్నాయని వివరించారు. అందులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ ఈ నలుగురు ఉన్నారన్నారు. దేశంలో చాలా పెద్ద పెద్ద పార్టీల నేతలను అరెస్ట్ చేసి జైల్లో పెడితే పార్టీ అంతరించిపోతుందన్నారు. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలను అరెస్ట్ చేస్తే పార్టీ అంతరించి పోతుందని భావించారన్నారు. కానీ అలా జరగలేదన్నారు. ఈ పార్టీని ఎంత తొక్కాలని ప్రయత్నిస్తుంటే అంత ఎత్తుకు ఎదుగుతోందని చెప్పారు సీఎం కేజ్రీవాల్.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే తనతో సంప్రదింపులు జరపాలని, అది దేశానికి మంచి వాతావరణాన్ని అవలంభింపజేస్తుందన్నారు. కానీ ఓ పార్టీ మాట వినలేదని తమపై కేసులు పెట్టి జైళ్లకు పంపించడం సరైన పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్య పాలన అంటే తనదని ఒక ఉదాహరణ చెప్పారు. 2015 ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటైందని అప్పుడు తన కేబినెట్లో ఓ మంత్రి ఒక షాపు యాజమాని నుంచి 5లక్షలు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఆ సమయంలో ఒక ఆడియో తన వాట్సప్ కు వచ్చిందని, దానిని విని ఆ మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించానన్నారు. అంతేకాకుండా సీబీఐ కేసులు వేసి జైలుకు పంపించానని గుర్తు చేశారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ అంటే అని గత ఉదంతాలను వివరించారు. విపక్షాలను జైలుకు పంపి రాజ్యాధికారాన్ని సాధించాలని బీజేపీ ఆలోచిస్తోందన్నారు. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నలుగురుతో పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరైన్ ను అరెస్ట్ చేశారని తెలిపారు. ఇలా మరికొన్ని రాష్ట్రాల్లోని నేతలను అక్రమ కేసులు పెట్టాలని బీజేపీ భావిస్తోందన్నారు. తదుపరి జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇలా చాలా మంది ఉన్నారన్నారు. బీజేపీ మాట వినేవాళ్లకు మంచి చేస్తూ, వినని వాళ్లపై ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

గతంలో జైలు నుంచే పాలన అందించిన కేజ్రీవాల్ ఒక్కసారిగా ప్రజల్లోకి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ మనీలాండరింగ్ కేసులో లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్టు చేసింది. నిన్నటి వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీ కింద తీహార్ జైలులో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ తరఫున ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ పై ఫిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడం కోసం 21 రోజులు అనుమతి ఇచ్చింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఊరట లభించినట్లయింది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us