Allu Arjun: బాబోయ్.. ఇదేం ట్విస్ట్.. నంద్యాల ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్

Allu Arjun: బాబోయ్.. ఇదేం ట్విస్ట్.. నంద్యాల ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్

Ram Naramaneni

|

Updated on: May 11, 2024 | 1:06 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ మద్దతు తెలిపారు. నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. అల్లు అర్జున్ రాకతో ఎమ్మెల్యే శిల్పారవి నివాసం దగ్గర స్టైలిస్ స్టార్ ఫ్యాన్స్ సందడి చేశారు. అక్కడ పెద్ద ఎత్తున కోలాహలం ఏర్పడింది. నంద్యాలకు అల్లు అర్జున్ రాక రాజకీయంగా చర్చనీయ అంశంగా మారింది. ఆ వీడియో చూసేద్దాం పదండి....

నంద్యాల ఎన్నికల ప్రచారంలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి దిగారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రవిచంద్రారెడ్డిని గెలిపించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు బన్నీ.  నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.. అల్లుఅర్జున్ దంపతులకు క్లోజ్ ఫ్రెండ్. 2019 ఎన్నికల్లోనూ రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ తెలిపారు ఐకాన్ స్టార్. బన్నీ రాక నేపథ్యంలో అక్కడకి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఫ్యాన్స్.

నా ప్రేమ, మద్దతు పవన్‌కల్యాణ్‌కే.. : అల్లు అర్జున్ 

మరోవైపు పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ పెట్టారు బన్నీ.  పవన్ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా అని పేర్కొన్నారు.  “ఒక ఫ్యామిలీ మెంబర్‌గా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు బన్నీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 

 

Published on: May 11, 2024 12:58 PM