Big News Big Debate: మోదీని కలిసిన తర్వాత పవన్ తన వ్యూహం మార్చుకున్నారా
ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు డైనమిక్స్ మారుతున్నాయి. ఆదివారం విజయనగరం జిల్లాలో పర్యటించిన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పొత్తులపై సరికొత్త చర్చకు తావిస్తున్నాయి.
ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు డైనమిక్స్ మారుతున్నాయి. ఆదివారం విజయనగరం జిల్లాలో పర్యటించిన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పొత్తులపై సరికొత్త చర్చకు తావిస్తున్నాయి. ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోమని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఒక్కఛాన్స్ అంటూ జనాల్లోకి వస్తున్నారు. గతంలో అధ్బుతాలు చేస్తామన్న ఎంతోమంది పెద్దమనుషులను, పార్టీలను నమ్మారు.. 2024లో తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటున్నారు పవన్ కల్యాణ్. బీజేపీ రోడ్‌మ్యాప్ ఇవ్వడం లేదని.. పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఊడిగం చేయబోనని ప్రకటించిన కొద్దిరోజులకే ప్రధానమంత్రి నరేంద్రమోదీని విశాఖలో కలిశారు. కలిసిన వెంటనే మంచి రోజులు వస్తాయన్న పవన్… తాజాగా సింగిల్‌గానే పోటీపై సంకేతాలు ఇస్తున్నారు. అటు మోదీని కలిసిన తర్వాత కూడా జనసేన ఉద్యమాల్లో బీజేపీ జెండాలు కనిపించడం లేదు. వీరి పొత్తు ప్రకటనలకే పరిమితం అవుతోంది.. ఇంతకీ పవన్ కల్యాణ్ నిర్ణయాలు… ఆయన ప్రకటనలు దేనికి సంకేతం? పొత్తులపై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటే ఇదే మరి !!
అడివి శేష్‌కు యూట్యూబ్ దిమ్మతిరిగే షాక్ హిట్ 2 టీజర్ కనిపించట్లే !!
Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??