మోదీ భేటీ తర్వాత పెరిగిన మాటల దాడి.. పవన్ వర్సెస్ వైసీపీగా ఏపీ పొలిటికల్ సీన్..(video)

మోదీ భేటీ తర్వాత పెరిగిన మాటల దాడి.. పవన్ వర్సెస్ వైసీపీగా ఏపీ పొలిటికల్ సీన్..(video)

Ravi Kiran

|

Updated on: Nov 14, 2022 | 10:03 AM

వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టక తప్పదంటూ..



వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టక తప్పదంటూ.. వైసీపీ నాయకుల వ్యూహంగా ఉంటే.. మీరు ధైర్యంగా పోరాడండి. మీ వెంట నేనున్నా అంటూ తన శ్రేణులతో కలసి ప్రతివ్యూహం రచిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నరకు పైగా సమయం ఉంది. ఇప్పటి నుంచే వైసీపీ వర్సెస్ జనసేన అన్నచందంగా మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ నేతలు ప్రేమాయణమంటూ సూటి పోటి మాటలు ..వీకెండ్ గెస్ట్.. వ్యంగ్యాస్త్రాలు..చిలుకా గోరింకల.. ఉపమానాలు..తెగిన గాలిపటం.. ఉపమేయాలు..పాల్ తో పోలికల ఎద్దేవాలు..టార్గెట్ ఒక్కటే కానీ..ఎక్కు పెట్టిన మాటల బాణాలు ఎన్నో… అన్నిటికీ ఒకటే మందు.. ధైర్యంగా ముందుకెళ్లడమేనంటూ..జనసేనాని తన శ్రేణులకు ధైర్యవచనాలు..ఇదీ తాజాగా ఏపీలోని పరిస్థితి.

Published on: Nov 14, 2022 10:03 AM