Big News Big Debate: మునుగోడులో నిలిచే మొనగాడు ఎవరు.? పోలింగ్‌ డే రోజు కూడా ఫిర్యాదులా..?(లైవ్)

Big News Big Debate: మునుగోడులో నిలిచే మొనగాడు ఎవరు.? పోలింగ్‌ డే రోజు కూడా ఫిర్యాదులా..?(లైవ్)

Anil kumar poka

|

Updated on: Nov 03, 2022 | 7:10 PM

సిట్టింగ్‌ సీటును కాంగ్రెస్ కాపాడుకుంటుందా.? వ్రతం చెడ్డా రాజగోపాల్‌కు ఫలితం దక్కుతుందా..? అధికారపార్టీ ఆధిపత్యమే నెగ్గుతుందా.? మునుగోడు మొనగాడు ఎవరు..?


గడిచిన మూడు నెలలుగా తెలంగాణ రాజకీయాలను శాసించిన మునుగోడు బైపోల్‌ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరింది. ఓటరు తీర్పు.. పార్టీల భవిష్యత్తు రెండూ కూడా ఈవీఎం బాక్సుల్లో భద్రంగా ఉన్నాయి. మునుగోడు మొనగాడు ఎవరో.. ప్రధానపార్టీల్లో ఎవరికి జనం మద్దతిచ్చారో ఆదివారం తేలిపోతుంది. ఇక పోలింగ్‌ రోజు కూడా పార్టీల మధ్య ఫైటింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈసీ వద్దకు ఫిర్యాదులతో పరుగులు తీశారు నేతలు. ఇక ఓటర్లు కూడా తమ తాయిలాలు సంగతేంటని నిలదీయడం ద్వారా పార్టీలే కాదు ఓటర్లు కూడా ట్విస్టులు ఇచ్చారు.సరిగ్గా మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ఆగస్టు 8న ఆయన రిజైన్‌ చేయడం.. ఆమోదం వెంటవెంటనే జరిగిపోయాయి. అప్పటి నుంచి పార్టీలన్నీ మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Published on: Nov 03, 2022 07:10 PM