PM Modi: మీ ఐక్యతకు.. ధైర్యానికి హాట్సాఫ్‌.! కార్మికులతో ఫోన్‌లో సంభాషించిన ప్రధాని మోదీ

PM Modi: మీ ఐక్యతకు.. ధైర్యానికి హాట్సాఫ్‌.! కార్మికులతో ఫోన్‌లో సంభాషించిన ప్రధాని మోదీ

Anil kumar poka

|

Updated on: Nov 30, 2023 | 3:29 PM

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్‌క్యారా టన్నల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటకొచ్చిన విషయం తెలిసిందే. 17 రోజులుగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ప్రధాని మోదీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులంతా క్షేమంగా బయటకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని సొరంగంలో వారు ధైర్యంతో ఉండటాన్ని ప్రశంసించారు.

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్‌క్యారా టన్నల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటకొచ్చిన విషయం తెలిసిందే. 17 రోజులుగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ప్రధాని మోదీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులంతా క్షేమంగా బయటకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని సొరంగంలో వారు ధైర్యంతో ఉండటాన్ని ప్రశంసించారు. 17 రోజులు అంటే తక్కువ సమయం కాదు..శ్రామికులు చూపిన ధైర్యం సాహసోపేతమైందని పొగిడారు. అధికారుల ప్రయత్నాలు కుటుంబ సభ్యుల ప్రార్ధనలతో క్షేమంగా బయటకు వచ్చారని అన్నారు. ప్రతిరోజు ఉత్తరాఖండ్ సీఎం, పీఎంఓ అధికారులతో సమాచారం తాను తెలుసుకున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. టన్నెల్ లో ఐక్యంగా ధైర్యంగా కార్మికులంతా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారని అన్నారు. మరోవైపు తామంతా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారమైనా అన్నదమ్ముల్లా మెలిగామని కార్మికులు ప్రధానితో తెలిపారు. ప్రతిరోజు ఉదయం మార్నింగ్ వాక్ యోగా చేసే వాళ్ళమని.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. ప్రతిరోజు ఆహారం కావలసిన సదుపాయలన్నీ అధికార యంత్రాంగం తమకు కల్పించిందని ప్రధానికి తెలిపారు కార్మికులు. ఉత్తరకాశి సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావటంతో వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిసాయి. కార్మికుల గ్రామాల్లో మరోసారి దీపావళి పండుగ వాతావరణం నెలకొంది. సొరంగంలో చిక్కుకుని 17 రోజుల పాటు నరక యాతన అనుభవించిన తర్వాత తమకు దక్కిన సంతోషాన్ని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.