AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: టికెట్స్ తెగడంలో.. పెద్ది రికార్డ్

Peddi: టికెట్స్ తెగడంలో.. పెద్ది రికార్డ్

Phani CH
|

Updated on: Jun 05, 2026 | 3:24 PM

Share

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. బుక్‌మైషోలో గంటకు 40 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ ఫీట్ సాధించిన నాలుగో తెలుగు చిత్రంగా ‘పెద్ది’ నిలిచింది. ఇంతకుముందు ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’, ‘పుష్ప’ చిత్రాలు మాత్రమే ఈ ఘనతను అందుకున్నాయి.

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వద్ద పెద్ది మేనియా కనిపిస్తోంది. జూన్ 4న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. బుధవారం ప్రీమియర్ షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ఇప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది పెద్ది మూవీ. ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ యాప్‌ బుక్‌మై షో లో ‘పెద్ది’ సినిమా ఊహించని రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. బుక్ మై షోలో … పెద్ది మూవీ టికెట్స్ .. ప్రస్తుతం గంటకు ఏకంగా 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడైపోతున్నాయి. బుక్‌మై షో సంస్థ 2023లో ‘అవర్లీ ట్రెండింగ్‌’ అంటే గంటల వారీ బుకింగ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. గంటకు 40 వేల టికెట్ల మార్క్‌ను అందుకున్న నాలుగో తెలుగు చిత్రంగా ‘పెద్ది’ నిలిచింది. అంతకుముందు కేవలం ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్‌’, ‘పుష్ప’ సినిమాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం

లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!

ఎల్‌నినో ముప్పు.. ఈ ఏడాదికి ఈ పంటలే బెస్ట్.. రేటుకు రేటు, ప్రభుత్వం హామీ

Silver Price: వెండి దిగుమతిపై కేంద్రం ఆంక్షలు.. మళ్లీ ధర కొండెక్కుతుందా?

ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్.. స్కూటీలోనే అన్నీ

Follow Us