Shocking Video: కదిలే రైలు దిగుతూ పట్టాల కిందకు.. రెప్పపాటులో వృద్ధుడిని కాపాడిన ఆర్‌పీఎఫ్ సిబ్బంది.. వీడియో
Cops Save Man From Falling Under Train: రెప్పపాటు నిర్లక్ష్యం మిమ్మల్ని మృత్యువు అంచుల్లోకి తీసువెళుతుంది. ఒక్కోసారి ప్రాణాలనే బలితీసుకుంటుంది. అందుకే ఏమరపాటు..
Cops Save Man From Falling Under Train: రెప్పపాటు నిర్లక్ష్యం మిమ్మల్ని మృత్యువు అంచుల్లోకి తీసువెళుతుంది. ఒక్కోసారి ప్రాణాలనే బలితీసుకుంటుంది. అందుకే ఏమరపాటు పనికిరాదని నిత్యం జరిగే సంఘటనలు మనకు హితబోధ చేస్తుంటాయి. కొన్నిసార్లు జరిగిన సంఘటనలు చూసి మనం కూడా మారలంటూ సూచనలు చేస్తుంటాయి. కానీ.. మనం మారకుండా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తే.. ఏమవుతుందో ఈ వీడియోలో చూడవచ్చు. తరచూ రైల్వే శాఖ కదులుతున్న రైలును ఎక్కవద్దని.. దాని నుంచి దిగవద్దని సూచిస్తుంటుంది. కానీ అలాంటివేమీ పట్టించుకోకుండా చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఒక్కోసారి ప్రాణాలను సైత పోగొట్టుకుంటుంటారు. తాజాగా.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఘజియాబాద్ రైల్వే స్టేషన్‌లో గోమతి ఎక్స్‌ప్రెస్ రైలు కదిలేందుకు సిద్దంగా ఉంది.. మెల్లగా కదిలి స్పీడ్ పుంజుకుంది. అంతలోనే ఉన్నట్టుండి ఓ వృద్ధుడు రైల్లోంచి కిందపడుతూ కనిపించాడు. ఎక్కడ్నుంచి గమనించారో తెలియదు గానీ, మెరుపు వేగంతో వచ్చిన ఆర్‌పీఎఫ్ అధికారి ఆ వృద్ధుడిని సురక్షితంగా కాపాడగలిగారు. రెప్పపాటు క్షణంలోనే ఇదంతా జరిగిపోవటం అక్కడి స్థానికుల్ని షాక్‌కు గురిచేసింది. అయితే.. వృద్ధుడు రైల్లోంచి జారి పట్టాలపై పడిపోతున్న దృశ్యం అందరినీ భయపడేలా చేస్తోంది.
షాకింగ్ వీడియో..
गाज़ियाबाद रेलवे स्टेशन पर एक बुजुर्ग यात्री को मौत के मुँह से बचाया @RPF_INDIA के कॉन्स्टेबल त्रिलोक शर्मा और कांस्टेबल श्याम सिंह को रेलवे पुलिस ने इस काम के लिए सराहा है pic.twitter.com/FwCsjvrQzC
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 6, 2021
కాగా.. ఆ క్షణంలో చాకచక్యంగా వ్యవహరించి వృద్ధుడిని కాపాడిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్ త్రిలోక్ శర్మ, శ్యామ్ సింగ్‌లను పలువురు ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో పెద్ద సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తున్నారు. దయ చేసి చిన్న చిన్న పొరపాట్లకి మీ జీవితాన్ని బలి చేసుకోకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. తొందర పాటు వల్ల కుటుంబాలు విషాదంలో కూరుకుపోతాయని పేర్కొంటున్నారు.