AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Butterfly Park: మంత్రముగ్ధులను చేస్తున్న బటర్ ఫ్లై పార్క్

Butterfly Park: మంత్రముగ్ధులను చేస్తున్న బటర్ ఫ్లై పార్క్

M Sivakumar
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 23, 2023 | 5:46 PM

Share

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మూలపాడు సీతాకోకచిలుకల పార్క్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో మంచి గుర్తింపును తెచ్చుకున్న మూలపాడు సీతాకోకచిలుకల పార్క్ పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపడితే.. సందర్శకుల తాకిడి మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో పాటు ఏపీకే తలమానికంగా నిలుస్తుందంటున్నారు అధికారులు. ప్రధాన అటవీ సంరక్షణ అధికారి మధుసూదనరెడ్డి కృషితో పాటు ఎన్టీటీపీఎస్ సంస్థ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మూలపాడు సీతాకోకచిలుకల పార్క్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో మంచి గుర్తింపును తెచ్చుకున్న మూలపాడు సీతాకోకచిలుకల పార్క్ పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపడితే.. సందర్శకుల తాకిడి మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో పాటు ఏపీకే తలమానికంగా నిలుస్తుందంటున్నారు అధికారులు. ప్రధాన అటవీ సంరక్షణ అధికారి మధుసూదనరెడ్డి కృషితో పాటు ఎన్టీటీపీఎస్ సంస్థ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పార్క్ కు సంబంధించిన పనులు పూర్తయితే.. నిత్యం ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. మూలపాడు అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అటవీ ప్రాంతంలో వృక్షసంపద, జంతుజాలం, ఔషధ మొక్కలు, సెలయేళ్లతో పాటు ప్రకృతి ప్రసాదించిన 68 రకాల సీతాకోక చిలుకలు విహరిస్తూ.. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంటాయి. దీన్ని గ్రహించిన అప్పటి జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం.. 2018లో అడవిలో పర్యటించి.. సీతాకోకచిలుకల పార్క్‌ను 10 ఎకరాల స్థలంలో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సీతాకోకచిలుకలకు అవసరమైన మకరందం ఉత్పత్తి చేసే మొక్కలను పెంచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రోలో రెచ్చిపోయిన మరో యువతి !! భిన్నరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు

Raksha Bandhan : ఆవుపేడతో అందమైన రాఖీలు

ఇంటిముందు వాకిలి అలుకుతున్న మహిళ.. అంతలోనే ??

ఆకాశం నుంచి పడిన అతిపెద్ద ఐస్‌ గడ్డ !! ఇంటి కప్పును చీల్చుకుంటూ..

TOP 9 ET News: మళ్లో బాంబు పేల్చిన రేణూ దేశాయ్‌ | యంగ్ హీరో మాటలకు చిరు ఎమోషనల్

 

Published on: Aug 23, 2023 09:47 AM