Ferrari: స్క్రాప్ కారుకు వేలంలో రూ.15 కోట్లా
వింటేజ్ వస్తువులకు కాస్త డిమాండ్ ఎక్కువే. పురాతన కాలం నాటి అరుదైన వస్తువులను సేకరించడం చాలామందికి అలవాటు. ప్రధానంగా వింటేజ్ కార్లంటే చాలామంది ఇష్టపడతారు. ఎంత ఖర్చైనా వాటిని కొని సొంతం చేసుకుంటారు. తాజాగా ఓ తుక్కు కారుకు భారీ ధర పలికింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో అర్‌ఎం సోథెబీ సంస్థ వింటేజ్ కార్స్ వేలం నిర్వహించింది. దీనిలో ఫెరారీ 500 మాండియల్ స్ఫైడర్ సిరీస్ 1 మోడల్ కారును వేలంలో ఉంచగా దానికి ఊహించని ధర పలికింది.
వింటేజ్ వస్తువులకు కాస్త డిమాండ్ ఎక్కువే. పురాతన కాలం నాటి అరుదైన వస్తువులను సేకరించడం చాలామందికి అలవాటు. ప్రధానంగా వింటేజ్ కార్లంటే చాలామంది ఇష్టపడతారు. ఎంత ఖర్చైనా వాటిని కొని సొంతం చేసుకుంటారు. తాజాగా ఓ తుక్కు కారుకు భారీ ధర పలికింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో అర్‌ఎం సోథెబీ సంస్థ వింటేజ్ కార్స్ వేలం నిర్వహించింది. దీనిలో ఫెరారీ 500 మాండియల్ స్ఫైడర్ సిరీస్ 1 మోడల్ కారును వేలంలో ఉంచగా దానికి ఊహించని ధర పలికింది. టైర్లు ఊడిపోయి, ఎక్కడికక్కడ కాలిపోయి తుక్కుగా మారిన ఈ రేసు కారును ఏకంగా 1.87 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఇది ఇండియన్ కరెన్సీ ప్రకారం 15 కోట్లపైనే. 1960ల్లో ఓ రేసులో ఈ కారు ప్రమాదానికి గురైంది. ఇటాలియన్ రేసింగ్ డ్రైవర్ అల్బెరో అస్కరీ..1952, 53ల్లో వరుసగా సాధించిన ఫార్ములా వన్ వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్ షిప్ విజయాలకు గుర్తుగా ఫెరారీ సంస్థ ఈ కారును తయారు చేసింది. ఫెరారీకి మొట్టమొదటి రేసింగ్ విజయాన్ని అందించిన డ్రైవర్ ఫ్రాంకో కోర్టేస్ 1954లో ఈ కారును కొనుగోలు చేశాడు. తర్వాత ఇది 1958లో అమెరికాకు తరలిపోయింది. వింటేజ్ కార్లకు వేలంలో అధిక ధర పలకడం సర్వసాధరణమే కానీ ఇలా తుక్కుగా మారిన కారును కోట్ల రూపాయలకు దక్కించుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Butterfly Park: మంత్రముగ్ధులను చేస్తున్న బటర్ ఫ్లై పార్క్
మెట్రోలో రెచ్చిపోయిన మరో యువతి !! భిన్నరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
Raksha Bandhan : ఆవుపేడతో అందమైన రాఖీలు
ఇంటిముందు వాకిలి అలుకుతున్న మహిళ.. అంతలోనే ??
ఆకాశం నుంచి పడిన అతిపెద్ద ఐస్ గడ్డ !! ఇంటి కప్పును చీల్చుకుంటూ..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

