నిమిషం టీజర్ల కాలం పోయింది.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కొత్త ట్రెండ్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు లాంగ్ గ్లింప్స్, డీటైల్డ్ టీజర్ల ట్రెండ్ నడుస్తోంది. కథపై క్లారిటీ ఇవ్వడానికి దర్శకులు నిమిషాల పరిమితి గురించి ఆలోచించకుండా భారీ విజువల్స్ విడుదల చేస్తున్నారు. ‘డ్రాగన్’, ‘వారణాసి’, ‘రామాయణ’, ‘రాకా’, ‘స్పిరిట్’ వంటి సినిమాలు ఈ కొత్త ప్రమోషన్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచుతున్నాయి.
కన్ఫ్యూజన్ వద్దు.. లెంత్ ఎక్కువైపోతుందనే కంగారు వద్దు.. రిలీజ్ డేట్ చాలా దూరం ఉందనే టెన్షన్ వద్దు.. విజువల్స్ ఎక్కువ చూపిస్తే రివీల్ అయిపోతుందనే భయం వద్దు.. చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్దాం.. టాలీవుడ్ టూ బాలీవుడ్ మన దర్శకులు ఫాలో అవుతున్న ప్రాసెస్ ఇదే ఇప్పుడు. దీనివల్ల ఆడియన్స్‌కు కూడా ఓ క్లారిటీ వస్తుంది. మరి ఈ కొత్త ట్రెండ్ ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా.. ఒకప్పుడు టీజర్ అంటే నిమిషం.. గ్లింప్స్ అంటే మహా అయితే నిమిషంన్నర.. కానీ ఇప్పుడు సీన్ మారంది. చెప్పాలనుకున్న కథను స్పష్టంగా చెప్తున్నారు మేకర్స్. దానికోసం లెంత్ టెన్షన్ లేకుండా టీజర్, ట్రైలర్స్ కట్ చేసి విడుదల చేస్తున్నారు. అవసరమైతే 4 నిమిషాల లెంత్ ఉన్న గ్లింప్స్ తీసుకొస్తున్నారు.. డ్రాగన్‌కు ఇదే చేసారు ప్రశాంత్ నీల్. డ్రాగన్ కథ ఇదే అంటూ 4.29 నిమిషాల గ్లింప్స్‌లో చెప్పారు నీల్. ఇది చూసాక సినిమా ఎలా ఉండబోతుందో కళ్లకు కట్టినట్లు క్లారిటీ వచ్చింది. మాఫియా చుట్టూ నడిచే కథ ఇది. దీనికంటే ముందు వారణాసికి రాజమౌళి కూడా ఇదే చేసారు. అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ మగధీర, ఈగ కథలు చెప్పిన జక్కన్న.. వారణాసికి మాత్రం కథ చెప్పకుండా విజువల్‌గా 3.30 నిమిషాలకు పైగా గ్లింప్స్‌లో చూపించారు. వారణాసి టీజర్ చూసాకే సినిమా స్పాన్ అర్థమైంది. ఎన్ని లోకాలు, ఎన్ని ఖండాల చుట్టూ కథ తిరుగుతుంది.. హీరో జర్నీ ఎలా సాగుతుందనేది టీజర్‌తోనే చూపించేసారు దర్శక ధీరుడు. రామాయణ సినిమాకు నితీష్ తివారి ఫాలో అయిన రూట్ ఇదే. లెంత్ గురించి ఆలోచించకుండా ‘వరల్డ్ ఆఫ్ రామాయణ’ పేరుతో ఇప్పటికే 5 నిమిషాలకు పైగా విజువల్స్ ఇచ్చేసారు మేకర్స్. రామాయణలోని పాత్రల్ని, పరిస్థితులను విజువల్స్‌తో ప్రేక్షకులకు పరిచయం చేసారు నితీష్. రాకా విషయంలో అట్లీ తన ఐడియాలజీకి 2.30 నిమిషాల విజువల్ రూపం ఇచ్చారు. అందులోనే బన్నీ మేకోవర్ చూపించారు. స్పిరిట్ కథను నిమిషంన్నర వాయిస్‌తో కొత్తగా రివీల్ చేసారు సందీప్. ఇలా మన మేకర్స్ అంతా స్టోరీ రివీలింగ్ చాలా డీటైలింగ్‌గా చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: జస్ట్ మిస్.. లేదంటే.. వీర భద్రుడిగా బన్నీ రెచ్చిపోయేవాడే
Ananya Nagalla: మూడేళ్లు బ్రేకప్ బాధతోనే బతికా.. శాడ్ బ్రేకప్ స్టోరీ
Jayam Ravi: నెలకు 40 లక్షలు ఇవ్వాల్సిందే! భార్య డిమాండ్ విని.. షాక్‌లో స్టార్ హీరో!
Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్
Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

