Elephant Rescued: గుంతలో పడిన ఏనుగును రక్షించిన అటవీ సిబ్బంది.. ఆ తర్వాత గజరాజు కోపంతో ఏం చేసిందంటే..? వీడియో
Elephant Rescued - Viral Video: కర్ణాటకలోని కొడగు జిల్లాలో గుంతలో పడిన ఏనుగును అటవీ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. గుంతలో నుంచి సురక్షితంగా దానిని బయటకు తీయడంతో
Elephant Rescued – Viral Video: కర్ణాటకలోని కొడగు జిల్లాలో గుంతలో పడిన ఏనుగును అటవీ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. గుంతలో నుంచి సురక్షితంగా దానిని బయటకు తీయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తౌటే తుపాను ధాటికి కొడగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కాగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఓ గున్న ఏనుగు ప్రమాదవశాత్తూ జిల్లాలోని అవరగుండా గ్రామంలో ఓ నీటి గుంతలో పడిపోయింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది జేసీబీ సాయంతో ఆ గున్న ఏనుగును రక్షించారు.
జేసీబీ ద్వారా దానిని బలవంతంగా గుంటనుంచి బయటకు తీశారు. అయితే గుంట నుంచి పైకి వచ్చిన అనంతరం ఏనుగు జేసీబీ వైపు కోపంతో వస్తుంది. జేసీబీతో పోరాడేందుకు కూడా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో వెంటనే అటవీ సిబ్బంది శబ్ధం వచ్చేలా బాంబులు వేయడంతో ఏనుగు ఆగిపోతుంది. వెంటనే అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ రెస్క్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సకాలంలో ఏనుగును రక్షించారంటూ అటవీ సిబ్బందిని పలువురు ప్రశంసిస్తున్నారు. దీంతోపాటు ఈ వీడియోను చాలామంది షేర్ చేస్తున్నారు.
Saidpur Coorg. God bless them pic.twitter.com/T9ox9jhpmf
— satish shah (@sats45) May 19, 2021
Also Read: